Begin typing your search above and press return to search.

తొలి రోజు కోటిన్నరకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన అల్లరోడు!

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఆ ఒక్కటీ అడక్కు''.

By:  Tupaki Desk   |   4 May 2024 10:51 AM GMT
తొలి రోజు కోటిన్నరకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన అల్లరోడు!
X

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''ఆ ఒక్కటీ అడక్కు''. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. నిన్న శుక్రవారం (మే 3) విడుదలైంది. అల్లరోడి మార్క్ ఎంటర్టైనర్ ఆశించిన జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. దీనికి తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కోటిన్నరకు పైగా వసూళ్లను సాధించింది.

'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 1.62 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇటీవలి కాలంలో అల్లరి నరేష్‌ కి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. కామెడీ సినిమాల కోసం వేచి చూస్తున్న జనాలు.. నరేశ్ ను ఎంటర్టైనింగ్ రోల్ లో చూడటానికి ఆసక్తి కనబరిచినట్లు మొదటి రోజు కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది.

నిజానికి కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్.. గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్ లో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా చేశారు. సమ్మర్ సీజన్‌లో కామెడీ చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి, ఇది త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంలో కామెడీతో పాటుగా ఒక యూనిక్ కాన్సెప్ట్ ను చర్చించారు. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? వివాహ వేదికల ద్వారా ఎలా దోపిడీకి గురవుతున్నారు? అనేది ఈ చిత్రం ద్వారా బయటపెట్టారు. నిజానికి ఇది చాలా సీరియస్‌ ఇష్యూ అయినప్పటికీ, దీంట్లో అల్లరి నరేష్ మార్క్ ఎంటర్టైనింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు.

ఇందులో అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్, రితూ చౌదరి, అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా.. అబ్బూరి ర‌వి డైలాగ్స్ రాశారు.