Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ మ‌డ‌త‌పెట్ట‌డానికి రెడీ అయిన కాంబినేష‌న్స్!

మ‌ళ్లీ అదే త‌ర‌హా విజ‌యాన్ని న‌మోదు చేస్తార‌నే అంచనాలు భారీగా ఏర్ప‌డ‌తాయి. తాజాగా మ‌రోసారి అలాంటి హిట్ కాంబినేష‌న్స్ చేతులు క‌లిపాయి.

By:  Tupaki Desk   |   23 April 2024 7:30 AM GMT
మ‌ళ్లీ మ‌డ‌త‌పెట్ట‌డానికి రెడీ అయిన కాంబినేష‌న్స్!
X

హిట్ కాంబినేష‌న్ అంటే మార్కెట్ లో క్రేజ్ మామూలుగా ఉండ‌దు. అందులో హీరో-హీరోయిన్ల కాంబినేష‌న్ అంటే మ‌రింత ఆస‌క్తిక‌రం. మ‌ళ్లీ అదే త‌ర‌హా విజ‌యాన్ని న‌మోదు చేస్తార‌నే అంచనాలు భారీగా ఏర్ప‌డ‌తాయి. తాజాగా మ‌రోసారి అలాంటి హిట్ కాంబినేష‌న్స్ చేతులు క‌లిపాయి. ర‌ణ‌బీర్ క‌పూర్ -అలియాభ‌ట్ రియ‌ల్ లైప్ లో భార్య‌భ‌ర్త‌లు. పెళ్లైన త‌ర్వాత తొలిసారి 'బ్ర‌హ్మ‌స్త్ర‌'లో న‌టించారు. అందులో ఆ జోడీకి మంచి పేరొచ్చింది. ఇద్ద‌రి మ‌ద్య కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. మ‌ళ్లీ 'బ్ర‌హ్మ‌స్త్ర‌-2' లోనూ రిపీట్ అవుతుంది.

అయితే అంత‌కు ముందే మ‌రో సినిమాతో మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. ల‌వ్ అండ్ వార్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న చిత్రంలో ఇద్ద‌రు మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించ‌డం విశేషం.

ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ యుద్దాన్ని హైలైట్ చేయ‌బోతున్నారు. అలాగే కంగ‌నా ర‌నౌత్- మాధ‌వ‌న్ జోడీ మ‌రోసారి రిపీట్ అవుతుంది. విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న ఓ సైకాలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉంది. ఎనిమిదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేస్తున్నారు.

'త‌ను వెడ్స్ మ‌ను' లో ఇద్ద‌రు న‌టించిన సంగ‌తి తెలిసిందే. 'బవాల్' తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న వ‌రుణ్ ధావ‌న్-జాన్వీక‌పూర్ రెండ‌వ‌సారి న‌టించ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. 'స‌న్నీ సంస్కారీ కీ తుల‌సీ కుమారి' అనే చిత్రంలో క‌లిసి న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

శ‌శాంక్ తైవాన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ టైగ‌ర్ ష్రాప్ -దిశా ప‌టానీ. ఇద్ద‌రు తొలిసారి జంట‌గా న‌టించిన 'భాఘీ-2' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

ఇద్ద‌రు యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అద‌ర‌గొట్టిన వైనం ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో అల‌రించింది. తాజాగా 'హీరో నెంబ‌ర్ -1' అనే సినిమాతో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ శ‌క్తి తెర‌కెక్కిస్తోన్న చిత్రంలో తొలుత సారా అలీఖాన్ హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆమె అనివార్య కార‌ణాల‌తో త‌ప్పుకోవ‌డంతో ఆ ఛాన్స్ దిశా ప‌టానీకి ద‌క్కింది. ఇంకా మ‌రికొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఆ వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.