Begin typing your search above and press return to search.

'డార్లింగ్‌' ఫ్యాన్స్‌ స్పెషల్‌ డే సందడి

నేడు 14 ఏళ్లు పూర్తి చేసుకున్న డార్లింగ్‌ సినిమాకు మరో 14 ఏళ్ల తర్వాత కూడా ఇదే స్థాయి క్రేజ్ మరియు ఇదే స్థాయి ఆధరణ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   23 April 2024 6:46 AM GMT
డార్లింగ్‌ ఫ్యాన్స్‌ స్పెషల్‌ డే సందడి
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'డార్లింగ్‌' ఒకటి. ప్రభాస్ కి ఊత పదం అయిన డార్లింగ్ టైటిల్‌ తో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో డార్లింగ్‌ స్పెషల్‌ డే ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

డార్లింగ్‌ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కాజల్ అగర్వాల్‌ నటించింది. కామెడీతో పాటు మంచి సెంటిమెంట్‌ ను పండించిన దర్శకుడు కరుణాకరన్‌ ప్రభాస్ కెరీర్ లో నిలిచి పోయే సినిమాను అందించాడు. అందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌ దర్శకుడు కరుణాకరన్‌ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ప్రభాస్ మరియు కాజల్‌ కాంబో సన్నివేశాలు ఇప్పటికి టీవీలో చూసినప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ప్రభాస్‌ లోని కామెడీ యాంగిల్‌ ను డిఫరెంట్‌ గా చూపించిన దర్శకుడు భారీ స్టార్ కాస్టింగ్‌ తో ఈ సినిమాను రూపొందించాడు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. యూత్ లో ముఖ్యంగా అమ్మాయిల్లో ప్రభాస్ ఇమేజ్ డబుల్‌ అయ్యింది. డార్లింగ్‌ వంటి అబ్బాయిని కోరుకున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు.

నేడు 14 ఏళ్లు పూర్తి చేసుకున్న డార్లింగ్‌ సినిమాకు మరో 14 ఏళ్ల తర్వాత కూడా ఇదే స్థాయి క్రేజ్ మరియు ఇదే స్థాయి ఆధరణ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సందడి కొనసాగుతుంది. కనుక డార్లింగ్‌ మళ్లీ వచ్చినా కూడా యూత్‌ కి కచ్చితంగా బాగా కనెక్ట్‌ అవ్వడం ఖాయం.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. కల్కి సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం అవుతోంది. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరో వైపు సలార్‌ 2 సినిమా షూటింగ్‌ కూడా జరుగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు.