Begin typing your search above and press return to search.

దేవి - తమన్.. అస్సలు గ్యాప్ లేదు!

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలలో ముందుగా వినిపించే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్.

By:  Tupaki Desk   |   5 May 2024 4:24 AM GMT
దేవి - తమన్.. అస్సలు గ్యాప్ లేదు!
X

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్. టాలీవుడ్ లో మాగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తూ ఉండటం విశేషం. వీటిలో దేవి శ్రీ ప్రసాద్ లైన్ అప్ చూసుకుంటే ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే కనిపిస్తున్నాయి. సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటున్న స్టార్ దర్శకులు అందరూ ఫస్ట్ ఛాయస్ గా దేవిశ్రీ ప్రసాద్ ని చూజ్ చేసుకుంటున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలలో ముందుగా వినిపించే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చి ట్రెండ్ సెట్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువకి అదిరిపోయే బ్లాస్టింగ్ మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా సిద్ధమవుతున్న మల్టీ స్టారర్ చిత్ర కుభేర మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా ఉన్నారు. అలాగే నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి దేవిశ్రీ ప్రసాద్ సిద్ధం అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ లో అజిత్ హీరోగా సిద్ధమవుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే పాన్ ఇండియా మూవీ RC17 చిత్రాలు దేవిశ్రీప్రసాద్ చేస్తున్నారు. ఇక తమన్ లైన్ ఆఫ్ చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఓజీ పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

అలాగే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీకి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సిద్ధమవుతున్న రాజాసాబ్ మూవీ కూడా తమన్ చేతిలో ఉంది. అలాగే సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నీరజ కోన దర్శకత్వంలో రెడీ అవుతున్న తెలుసు కదా, ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న శబ్దం సినిమాలకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ క్రేజీ సినిమాలతో ఈ సంగీత దర్శకులు ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో చూడాలి.