Begin typing your search above and press return to search.

సర్‌ కి టాలీవుడ్‌ పై ఎంత అభిమానమో..!

కోలీవుడ్‌ స్టార్స్‌ చాలా మంది తమ సినిమాలను తెలుగు లో డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 5:11 AM GMT
సర్‌ కి టాలీవుడ్‌ పై ఎంత అభిమానమో..!
X

కోలీవుడ్‌ స్టార్స్‌ చాలా మంది తమ సినిమాలను తెలుగు లో డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అరవ హీరోల్లో చాలా మందికి తెలుగు సినిమా లు చేయాలని రిక్వెస్ట్‌ వచ్చినా కూడా పట్టించుకోరు. కానీ స్టార్‌ హీరో ధనుష్ మాత్రం బ్యాక్‌ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేస్తున్నాడు.

తమిళ సినిమాలతో పాటు ఇప్పటికే హిందీ మరియు ఇంగ్లీష్ సినిమాలు చేసిన ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సర్‌ సినిమా తో వచ్చిన ధనుష్ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

కుబేరా సినిమా తర్వాత ధనుష్‌ మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. శర్వానంద్‌ హీరోగా శ్రీకారం అనే సినిమాను రూపొందించిన దర్శకుడు కిషోర్ బి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో ధనుష్ ఒక సినిమాను చేసేందుకు సైన్ చేశాడు.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దర్శకుడు కిషోర్ చెప్పిన లైన్ కు ఇప్పెస్ అయిన హీరో ధనుష్‌ వెంటనే గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందట. దిల్‌ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నాడు. తెలుగు తో పాటు అదే సమయంలో తమిళంలో కూడా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

ద్వి భాష సినిమాలను ధనుష్‌ చేసుకుంటూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లో తన బిజినెస్ ను పెంచుకోవడం తో పాటు మరో వైపు తమిళంలో కూడా ప్రతి సినిమా తో మినిమం వసూళ్లు దక్కించుకుంటున్నాడు. దిల్‌ రాజు బ్యానర్‌ లో ధనుష్ సినిమా అవ్వడంతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్‌ అవ్వడం ఖాయం. మరి ఆ స్థాయిలో దర్శకుడు కిషోర్ సినిమాను రూపొందిస్తాడా అనేది చూడాలి.