Begin typing your search above and press return to search.

ఈషా గుప్తా మ‌రో బోల్డ్ అవ‌తార్

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఈషా గుప్తా చివరిసారిగా ప్రకాష్ ఝా `ఆశ్రమ్ 3`లో కనిపించింది. ఇందులో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు

By:  Tupaki Desk   |   21 April 2024 7:47 AM GMT
ఈషా గుప్తా మ‌రో బోల్డ్ అవ‌తార్
X

బాలీవుడ్ న‌టి ఈషా గుప్తా బోల్డ్ లుక్స్‌కి ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాల్లో ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌కు జ‌నాద‌ర‌ణ అసాధార‌ణం. తాజాగా రేసీ ఫోటోషూట్ నుండి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన ఇషా గుప్తా.. ఫోటో లీక్‌లతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 38 ఏళ్ల ఇషా హాట్ ఇమేజెస్ బంచ్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోషూట్ లో పాస్టెల్ నియాన్ గ్రీన్ ప్యాంట్‌సూట్‌- స్ట్రాప్‌లెస్ టాప్ లో ఇన్న‌ర్ అందాలు వెద‌ర్ ని హీటెక్కించాయి. దీనికి `హాయ్` అని సింపుల్ క్యాప్షన్ ఇచ్చింది ఈషా.

తాజా లుక్ పై అభిమానుల స్పంద‌న‌లు అనూహ్యం.ఈషాజీ చాలా అందంగా ఉంది! అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, హాటీ! మీరు చాలా అందంగా ఉన్నారు అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ఈషా గుప్తా బోల్డ్ ఫ్యాషన్ ఎంపికలు తరచుగా హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి. ఈషా అద్భుత‌మైన ఫార్మ‌ల్ లుక్ తో ప్ర‌తిసారీ చ‌ర్చ‌ల్లో నిలుస్తున్నారు. ఈషా తాజా లుక్ ని మ‌నీష్ పాల్ డిజైన్ చేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఈషా గుప్తా చివరిసారిగా ప్రకాష్ ఝా `ఆశ్రమ్ 3`లో కనిపించింది. ఇందులో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించారు. `ఆశ్రమ్ 3`లో బాబీ డియోల్ టైటిల్ క్యారెక్టర్ అయిన నిరాలా బాబా ఇమేజ్‌ని మార్చడానికి బ‌రిలో దిగిన‌ ఇమేజ్ బిల్డర్ సోనియా పాత్రను ఈషా గుప్తా పోషించింది. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ త‌న‌కు మంచి పేరును తెచ్చింది. దీనిపై ఈషాజీ స్పందిస్తూ.. నేను ఈ ప్రదర్శన గురించి మౌత్ టాక్ చాలా విన్నాను. మహమ్మారి సమయంలో అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో నేను ఢిల్లీలోని నా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను. ప్రతి ఒక్కరూ, `ఏమిటీ ప్రదర్శన!` అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. కాబట్టి ప్రకాష్ ఝా నాకు ఇలాంటి అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు .. నేను దీనిగురించి ఏమీ వినాలనుకోలేదు. మీరు నాకు ఒక్క రూపాయి ఇచ్చినా చాలు.. అయినా చేస్తాను. డబ్బు గురించి లేదా షూటింగ్ షెడ్యూల్ గురించి ..నా తేదీల గురించి అస్సలు చింతించలేదు. నా మేనేజర్‌కి ఉన్నదంతా చెప్పాను. ఈ షోలో నాకు అంతా బాగానే ఉంది. ప్రకాష్ సర్ సోనియా పాత్రలో అవ‌కాశం క‌ల్పించినందుకు ఆనందించాను`` అని ఈషా అన్నారు. ఈషా గుప్తా ఇంత‌కుముందు రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ చిత్రంలో హాట్ ఐట‌మ్ నంబ‌ర్ `ఏక్ బార్..` లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.