Begin typing your search above and press return to search.

Jr ఎన్టీఆర్.. ఆ రెండిటిపై కూడా క్లారిటీ వచ్చేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   6 May 2024 4:08 AM GMT
Jr ఎన్టీఆర్.. ఆ రెండిటిపై కూడా క్లారిటీ వచ్చేనా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. దేవర మూవీ ఇంకా సెట్స్ పై ఉండగానే హిందీలో హృతిక్ రోషన్ తో కలిసిచేస్తోన్న మల్టీ స్టారర్ మూవీ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ని కొద్ది రోజుల క్రితం తారక్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. వార్ 2 చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే దేవర, వార్ 2 చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం తారక్ సిద్ధం అవుతారు. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూడు చిత్రాలు కాకుండా తారక్ లైన్ అప్ లో మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ ఒక పౌరాణిక కథాంశంతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఉంటుందని గతంలో నాగవంశీ చెప్పారు. దానిపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఒక స్పై థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు అంటూ ప్రచారం నడుస్తోంది.

ఇప్పటికే తారక్ యష్ రాజ్ తో ఈ మూవీకి సంబంధించి ఒప్పందం జరిగిందని కూడా కథనాలు వినిపించాయి. దీనిపై యష్ రాజ్ ఫిలిమ్స్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తారక్ నుంచి కూడా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. ప్రస్తుతం తారక్ చేస్తోన్న సినిమాల నుంచి ఆ రోజు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని అంటున్నారు. అలాగే వార్ 2 సినిమా నుంచి తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి సంబందించిన ఎనౌన్సమెంట్ రావొచ్చని కూడా టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అలాగే యష్ రాజ్ బ్యానర్ లో చేయబోయే చిత్రాలపై ఏమైనా స్పష్టత వస్తుందా అనేది చూడాలి.