Begin typing your search above and press return to search.

కాజల్ అగర్వాల్ గ్లామర్ ట్రీట్.. వయసు తగ్గినట్లుందే..

వైట్ క్రీమ్ కలర్ఫుల్ డ్రెస్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. అంతేకాకుండా ఆమె వయసు కూడా కొంతవరకు తగ్గింది అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 9:44 AM GMT
కాజల్ అగర్వాల్ గ్లామర్ ట్రీట్.. వయసు తగ్గినట్లుందే..
X

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా డిఫరెంట్ గానే ఆలోచిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఆసక్తిని చూపిస్తోంది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా నటిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటుంది.

కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా కూడా ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన కూడా నిమిషాల్లోనే ట్రెండింగ్ లిస్టులో చేరిపోతాయి. ఇక ఆమె కాస్త గ్లామర్ టచ్ ఇచ్చినా కూడా కుర్రాళ్ళు ప్రేమతో కామెంట్ బాక్స్ ను నింపేస్తారు. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ ఆకాశం నుంచి దిగి వచ్చిన అందాల దేవతల తన గ్లామర్ తో ఎంతగానో అట్రాక్ట్ చేసింది.

వైట్ క్రీమ్ కలర్ఫుల్ డ్రెస్ లో అమ్మడు గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. అంతేకాకుండా ఆమె వయసు కూడా కొంతవరకు తగ్గింది అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

ముఖ్యంగా రెండు తరాల హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. కంటెంట్ బాగుంటే చాలు కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ కూడా పెద్దగా పట్టించుకోకుండా పాత్రలో లీనమై నటిస్తూ ఉంటుంది. ఇక ఆమె అందానికి ఇండస్ట్రీలో చాలా రకాల క్యాప్షన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చందమామ అనే ట్యాగ్ అభిమానులలో బలంగా స్థిరపడిపోయింది.

టాలీవుడ్ చందమామ ఎవరు అంటే టక్కున కాజల్ అగర్వాల్ గుర్తొస్తుంది. అంతలా ఆమె తన స్థాయిని పెంచుకుంది. ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం ఆమె సత్యభామ అనే సినిమాతో బిజీగా ఉంది. అలాగే ఇండియన్ 2 కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరో రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

సత్యభామ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్ అగర్వాల్ నటిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు కాస్త సీరియస్ కథలను కూడా ఓకే చేస్తుంది. అలాగే స్టార్ హీరోలు సినిమాలలో కూడా ఆమె ప్రత్యేకమైన పాత్రలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.