Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రొమాంటిక్ బ్యూటీ రొమాంటిక్ ఫోజ్‌

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ మూవీ తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ

By:  Tupaki Desk   |   21 April 2024 4:30 PM GMT
పిక్ టాక్ : రొమాంటిక్ బ్యూటీ రొమాంటిక్ ఫోజ్‌
X

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ మూవీ తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచిన కూడా అదృష్టం కొద్ది అవకాశాలు వచ్చాయి. రొమాంటిక్ లో అందాల విందు చేసినందుకు గాను లక్ష్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ లక్ష్య కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినా కూడా ఆమె వెంటే అదృష్టం ఉండటంతో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ మూవీ రంగ రంగ వైభవంగా లో నటించే అవకాశం ను దక్కించుకుంది. ఆ సినిమా కూడా కేతిక కి నిరాశే మిగిల్చింది.

హీరోయిన్‌ గా కేతిక శర్మ కి హిట్‌ పడక పోవడంతో ఆఫర్లు లేకుండా పోయాయి. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం కేతిక సందడి కొనసాగుతూనే ఉంది. అందాల ఆరబోత ఫోటోలను రెగ్యులర్‌ గా షేర్ చేస్తూ ఉండటంతో ఫాలోవర్స్ సంఖ్య భారీగానే పెంచుకుంది.

తాజాగా ఈ రొమాంటిక్ బ్యూటీ ఇలా రొమాంటిక్ ఫోజ్ ఇచ్చింది. క్లీ వేజ్ షో తో స్విమ్మింగ్‌ పూల్ వద్ద చాలా స్టైల్ గా, కూల్‌ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇంతటి అందాల రాశికి, రొమాంటిక్ బ్యూటీ కి ఆఫర్లు రాకపోవడం విడ్డూరం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటే కచ్చితంగా ముందు ముందు అయినా మళ్లీ ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలోనే ఈ అమ్మడు తెలుగులో కాకున్నా ఇతర భాషల్లో అయినా ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.