Begin typing your search above and press return to search.

SSMB 29.. మొత్తానికి మహేష్ తొలిసారి అలా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 April 2024 10:40 AM GMT
SSMB 29.. మొత్తానికి మహేష్ తొలిసారి అలా
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ లో ఇప్పటికే ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ ఇంకా అధికారికంగా మొదలు పెట్టకపోయినా.. సినిమా గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, నిర్మాత కె.ఎల్ నారాయణ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో మహేష్ కొత్త లుక్ అంటూ ఫోటోస్, వీడియోస్ తెగ షేర్ చేశారు ఫ్యాన్స్. ఆ తర్వాత పలు టెక్నీషియన్లతో మహేష్ దిగిన పిక్ బయటకు వచ్చింది. వాటన్నింటిలో మహేష్ బాబు క్యాప్ పెట్టుకుని కనిపించారు. ఇక నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ కమిన్స్ సూపర్ స్టార్ ను కలిశారు.

అందుకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. టాలీవుడ్ ప్రిన్స్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చారు. కమిన్స్ తోపాటు ఎస్ ఆర్ హెచ్ మిగతా ఆటగాళ్లు కూడా కలిశారు. ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో మహేష్ లాంగ్ హెయిర్, గడ్డాన్ని చూసి అంతా షాకైపోతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఫుల్ మేకోవర్ అవుతున్నట్లు అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి రాజమౌళి.. తన సినిమాల్లో హీరోలను నెవ్వర్ బిఫోర్ అనేలా చూపిస్తారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ ను ఫుల్ మేకోవర్ చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా కోసం మహేష్ పొడవాటి జుట్టు, లైట్ గా గడ్డం పెంచుతున్నట్లు సమాచారం. ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఈ మూవీ తెరకెక్కనుంది కనుక.. సూపర్ స్టార్ రగ్డ్ లుక్ లో కూడా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ నుంచి ఆయన అభిమానులు ఈ లుక్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే మహేష్ బాబు అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తారని, లుక్స్ లో ఏ మాత్రం ఛేంజ్ ఉండదని ఆయన యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడూ కామెంట్లు పెడుతుంటారు. ఇప్పుడు వాటన్నింటికి రాజమౌళి సినిమాలో సూపర్ స్టార్ లుక్ చెక్ పెట్టనుందని మహేష్ ఫ్యాన్స్ చెబుతున్నారు. SSMB 29 మూవీ కోసం మహేష్ రెండేళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ డిటైల్స్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని టాక్. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.