Begin typing your search above and press return to search.

లవ్ మౌళి సీన్స్.. హీరోయిన్ సిగ్గుపడిందట!

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి తేజస్వి మాదివాడ లవ్ మౌళి హీరోయిన్ పంఖురి గిద్వానీతో పాటు నవదీప్ ఫ్రెండ్ గా నటించిన భావన సాగిని ఇంటర్వ్యూ చేసింది.

By:  Tupaki Desk   |   22 April 2024 6:45 AM GMT
లవ్ మౌళి సీన్స్.. హీరోయిన్ సిగ్గుపడిందట!
X

ఒకప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన నటుడు నవదీప్.. కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంత విరామం తర్వాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ ఇప్పుడు క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్ మౌళి. పెయింటర్ ప్రేమకథగా ఈ సినిమాను అవనీష్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 19వ తేదీన విడుదల అవ్వాల్సిన ఉన్న ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా ఉంటున్న ఒక వ్యక్తికి అనుకోకుండా ప్రేమ దొరికితే ఎలా ఉంటుందనే కోణంలో లవ్‌ మౌళి చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్ లోనే దాదాపు స్టోరీ అంతా బయటపెట్టేశారు మేకర్స్. సినిమాలో నవదీప్ క్యారెక్టర్ ను క్లారిటీగా చూపించారు.

అయితే ఈ సినిమాలో నవదీప్‌ కు జోడీగా పంఖురి గిద్వానీ నటించింది. ఈ చిత్రంలో నవదీప్ ఒక సీన్‌ లో న్యూడ్‌ గా కనిపించనున్నట్టు ట్రైలర్‌ లో చూపించారు మేకర్స్. పంఖురి కూడా టాప్‌ లెస్‌ గా కనిపించనుందని తెలుస్తోంది. ఘాటు లిప్ లాక్ సీన్స్ కూడా ట్రైలర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ఇంటిమేట్ సీన్స్ గురించి పంఖురి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి తేజస్వి మాదివాడ లవ్ మౌళి హీరోయిన్ పంఖురి గిద్వానీతో పాటు నవదీప్ ఫ్రెండ్ గా నటించిన భావన సాగిని ఇంటర్వ్యూ చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో తేజస్వి.. "ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ చూశాను. ఆ సీన్స్ ను చేసినప్పుడు ఎలా అనిపించింది. నేను కూడా నటించా. కాబట్టి నాకు తెలుసు. రామ్ గోపాల్ వర్మ సినిమాతో వార్తల్లో నిలిచా. న్యూ*డ్ గా కనిపించా. మరి లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏం అనిపించింది" అని అడిగింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్‌ సినిమాలో నటించి పాపులర్ అయ్యింది తేజస్వి. ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలు కూడా అందుకుంది. ఇక లవ్ మౌళి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు సిగ్గు పడినట్లు తెలిపింది పంఖురి గిద్వానీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మరెన్నో ఈ ఇంటర్వ్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇంటర్వ్యూను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్.