Begin typing your search above and press return to search.

పుష్ప 2..మరో సౌండ్ మొదలయ్యేది ఎప్పుడు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా బజ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది

By:  Tupaki Desk   |   6 May 2024 4:05 AM GMT
పుష్ప 2..మరో సౌండ్ మొదలయ్యేది ఎప్పుడు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా బజ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే ఈ సినిమా తప్పకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా సుకుమార్ బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన మూవీ సీక్వెల్ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. మే1న పుష్ప ది రూల్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. దీనికి తెలుగు, హిందీ భాషలలో అద్భుతమైన ఆదరణ లభించింది. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు కంటే హిందీ ఆడియన్స్ పుష్పరాజ్ సాంగ్ కి ఎక్కువగా వీక్షించారు. దీనిని బట్టి నార్త్ ఇండియాలో పుష్ప ది రూల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ హెవీగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనేది సినీ విశ్లేషకుల మాట. దీంతో ఈ సారి రిలీజ్ చేయబోయే సాంగ్ ట్రెండ్ సెట్ చేసే స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తరహాలోనే అదిరిపోయే మెలోడీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జూన్ నెలలో పుష్ప ది రూల్ నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందంట. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ సాంగ్ ని రెడీ చేసేసినట్లు తెలుస్తోంది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఈ మెలోడీ సాంగ్ అందరికి నచ్చుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే పుష్ప ది రూల్ సినిమాకి హైప్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పుష్పరాజ్ సాంగ్ లో హుక్ స్టెప్ తో షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సెకండ్ సింగిల్ గా వచ్చే సాంగ్ మంచి ఆదరణ వస్తే సినిమా మరింతగా ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ కలెక్షన్స్ అందుకోవాలంటే కచ్చితంగా సినిమాపై పబ్లిక్ లో స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే అద్భుతమైన సాంగ్ ఇవ్వాలి. అనంతరం సెకండ్ టీజర్ కూడా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.