Begin typing your search above and press return to search.

విశాల్ రత్నం.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

ఈ లెక్కన చూసుకుంటే రత్నం మూవీ తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవాలంటే 4.50 కోట్లు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 4:27 AM GMT
విశాల్ రత్నం.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
X

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన సినిమాలని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. రెండు భాషలలో కూడా విశాల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ చివరిగా మార్క్ ఆంటోనీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో అంతగా క్లిక్ కాలేదు. లాంగ్ రన్ లో టోటల్ గా ఆ సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఆ సినిమా తర్వాత విశాల్ తనకి అలవాటైన కమర్షియల్ యాక్షన్ జోనర్ లో రత్నం మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సూర్యతో సింగం సిరీస్ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రత్నం మూవీ తెరకెక్కింది. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో జరిగే గొడవల నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతోందని తెలుస్తోంది. గతంలో హరి దర్శకత్వంలో విశాల్ పూజ మూవీ చేసి హిట్ అందుకున్నారు.

పూజ తరహాలోనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ చిత్రంగా రత్నం మూవీని హరి ఆవిష్కరించాడు. ఈ సినిమా ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో సొంతంగా రిలీజ్ చేస్తూ ఉండగా మరికొన్నిచోట్ల అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు.

విశాల్ ప్రతి సినిమాకి తెలుగులో 4 నుంచి 5 కోట్ల మధ్యనే థీయాట్రికల్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. రత్నం ఓవరాల్ బిజినెస్ వేల్యూ 4 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రత్నం మూవీ తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవాలంటే 4.50 కోట్లు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ సినిమాకి పోటీగా ఏప్రిల్ 26న పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. అయితే విశాల్ రత్నం మూవీ ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తప్ప స్పెషల్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ ఏవీ కూడా పెట్టడం లేదు. రత్నం ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

ఇలాంటి పరిస్థితిలో సక్సెస్ అందుకోవాలంటే మౌత్ టాక్ తో మాత్రమే సాధ్యం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే తెలుగులో ఒకప్పుడు మినిమమ్ హిట్స్ అందుకున్న విశాల్ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేయడం లేదు. కాబట్టి రత్నం సినిమా అతనికి చాలా ముఖ్యం. అలాగే డైరెక్టర్ హరి కూడా హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. కాబట్టి అతను కూడా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకుంటున్నాడు.