Begin typing your search above and press return to search.

హిందీలో కూడా రీ రిలీజ్ ట్రెండ్.. మన సినిమాతోనే..

దేశ వ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకొని అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్

By:  Tupaki Desk   |   6 May 2024 4:01 AM GMT
హిందీలో కూడా రీ రిలీజ్ ట్రెండ్.. మన సినిమాతోనే..
X

దేశ వ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకొని అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. సౌత్ ఇండియన్స్ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలకి కనెక్ట్ అయ్యారు. నార్త్ ఇండియన్స్ రామ్ చరణ్ లో శ్రీరాముడిని, ఎన్టీఆర్ లో హనుమాన్ ని చూశారు. అందుకే అక్కడి ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాకి నీరాజనాలు పలికారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్ ఇండియాలో తారక్, రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వారిని ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ గా నార్త్ ఇండియన్ ఆడియన్స్ చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1200+ కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. పలు విభాగాలలో గోల్డెల్ గ్లోబ్ అవార్డ్స్ ని ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది.

అలాగే బెస్ట్ ఒరిజినల్ సౌండ్ కేటగిరీలో నాటునాటు పాటకి గాను ఎంఎం కీరవాణి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాని హిందీలో పెన్ మూవీస్ డిస్టిబ్యూటర్ మరోసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. ఫస్ట్ రిలీజ్ కూడా ఈ కంపెనీనే చేసి భారీ లాభాలు ఆర్జించింది.

ప్రస్తుతం హిందీలో చెప్పుకోదగ్గ రిలీజ్ లు ఏవీ లేకపోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. చిన్న చిత్రాలు కొన్ని హిందీలో రిలీజ్ అవుతున్న థియేటర్స్ కి వెళ్లి చూసేంత గొప్పగా ఉండటం లేదంట. దీంతో అక్కడ థియేటర్స్ అన్ని కూడా ఖాళీగా వెలవెలబోతున్నాయంట. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మళ్ళీ రీరిలీజ్ చేస్తే థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

సౌత్ లో రీరిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. రీసెంట్ గా తమిళంలో విజయ్ గిల్లి మూవీ రీరిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ ట్రెండ్ ని చూసి బాలీవుడ్ లో కూడా అమలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారంట. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.

త్వరలో రీ రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్ అయ్యి మళ్ళీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటే ఆ బజ్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రీరిలీజ్ పై పెన్ మూవీస్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందనేది వేచి చూడాలి.