Begin typing your search above and press return to search.

అనిమల్‌ 2.. దర్శకుడి కొత్త మాట

స్పిరిట్‌ పూర్తి అయిన తర్వాతే అనిమల్‌ పార్క్‌ కి సంబంధించిన వర్క్ ను దర్శకుడు మొదలు పెట్టబోతున్నాడు.

By:  Tupaki Desk   |   23 April 2024 7:39 AM GMT
అనిమల్‌ 2.. దర్శకుడి కొత్త మాట
X

బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్‌ కపూర్‌, తెలుగు దర్శకుడు సందీప్ వంగ కాంబినేషన్‌ లో వచ్చిన అనిమల్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లను సాధించిన అనిమల్ సినిమాకు సీక్వెల్‌ తీస్తాను అంటూ ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగ ప్రకటించిన విషయం తెల్సిందే.

అనిమల్‌ 2 కి ఇప్పటికే అనిమల్‌ పార్క్ అనే టైటిల్ ను కన్ఫర్మ్‌ చేశాడు. సీక్వెల్‌ లో మరింత వైల్డ్‌ కంటెంట్‌ ఉండబోతుంది అంటూ ముందుగానే దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు. ప్రస్తుతం ప్రభాస్ మూవీ స్పిరిట్‌ కోసం సందీప్ వంగ స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు.

స్పిరిట్‌ పూర్తి అయిన తర్వాతే అనిమల్‌ పార్క్‌ కి సంబంధించిన వర్క్ ను దర్శకుడు మొదలు పెట్టబోతున్నాడు. తాజాగా సందీప్ వంగ స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించాడు. 2026 లో అనిమల్ పార్క్ ను మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశాడు.

అనిమల్‌ సినిమాతో పోల్చితే అనిమల్ పార్క్ లో మరింత వైల్డ్‌ కంటెంట్‌ తో కథ ఉంటుందని అన్నాడు. కొన్ని పాత్రలు కొత్తగా పరిచయం అవ్వబోతున్నాయి. గత సినిమాలో ఉన్న ఎమోషన్ ను కంటిన్యూ చేస్తూ సీక్వెల్‌ ను రూపొందించే విధంగా సందీప్ వంగ స్క్రీప్ట్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

అనిమల్ పార్క్ ను భారీ బడ్జెట్‌ తో ప్రముక నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు నిర్మించబోతున్నారు. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా తో పాటు అల్లు అర్జున్‌ హీరోగా కూడా ఒక సినిమా ఉండబోతుందని ప్రకటన వచ్చింది. తాజాగా సందీప్ చేసిన వ్యాఖ్యలతో అనిమల్‌ పార్క్ తర్వాతే బన్నీ మూవీ అని తేలిపోయింది.