Begin typing your search above and press return to search.

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడిపై ట్రోల్స్!

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఒక ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు! అంటే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంటుంది

By:  Tupaki Desk   |   5 May 2024 11:30 PM GMT
క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడిపై ట్రోల్స్!
X

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఒక ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు! అంటే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంటుంది. అలాంటి ఉత్కంఠ వేశ్యా వాటిక‌ల ఆధారంగా రూపొందించిన `హీరామండి` విష‌యంలోను ఉంది. అయితే ఇది వెబ్ సిరీస్. పైగా భ‌న్సాలీ ఒక సిరీస్‌కి ద‌ర్శక‌త్వం వహించ‌డం ఇదే తొలిసారి. దానివ‌ల్ల అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. కానీ ఈ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో హీరామండి దారుణంగా విఫ‌లమైంద‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి,

దేశంలోనే కాస్ట్ లీ వెబ్ సిరీస్ గా పేరున్న హీరామండి ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేదు. భ‌న్సాలీ కెరీర్ లో చెత్త విజన్ ఇది అంటూ విమర్శ‌లొచ్చాయి. భన్సాలీ తన కెరీర్‌లో ఎన్నో క‌ళాత్మ‌క చిత్రాల‌ను తెరకెక్కించారు. గుజారిష్, సావరియా, ఖామోషి వంటి కొన్ని ఫ్లాప్‌లను ఎదుర్కొన్నా కానీ దేవ‌దాస్, రామ్ లీలా, గంగూభాయి క‌థియా వాడీ వంటి సంచ‌ల‌న విజ‌యాల‌ను ఆయ‌న అందించారు. ఇక ఫ్లాపుల విషయంలో అంత‌గా క‌ల‌త చెంద‌ని భ‌న్సాలీ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో త‌న‌కంటూ యూనిక్ గా ఉండే అభిమానుల‌ను సుస్థిరం చేసుకున్నారు.

కానీ హీరామండి విషయంలో అది వ‌ర్క‌వుట్ కాలేద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో షర్మిన్ సెగల్ (భ‌న్సాలీ మేన‌కోడ‌లు) వంటి వర్ధమాన నటి షో అంతటా స్తబ్దుగా ఒకే ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చినందుకు సోష‌ల్ మీడియాల్లో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఇది ఒక క‌ళాత్మ‌క చిత్రం అనే కంటే.. ఇది భారతీయ ప్రేక్షకుల కోసం ఒక సంచలనాత్మక సిరీస్ అనే కంటే ఎక్కువగా పాకిస్తానీ సోప్ ఒపెరా అని యూత్ భావిస్తోంది. భ‌న్సాలీ కెరీర్ లో ఇది ఒక మ‌చ్చ లాంటిది.

త‌దుప‌రి రాజ్ కపూర్ క్లాసిక్ సంగమ్ ఆధారంగా `ల‌వ్ అండ్ వార్` తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లాంటి ప్ర‌తిభావంత‌మైన తారాగణం న‌టిస్తోంది. కానీ హీరామండి నిరాశ‌ప‌ర‌చ‌డంతో ర‌ణ‌బీర్ ఫ్యాన్స్ అత‌డిని ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల‌ని సూచిస్తున్నారు. యానిమ‌ల్ 2 పైనే ఎక్కువ ఫోక‌స్ చేయాల‌ని అంతా ఆంక్షిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.