Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం..రిలీజ్ డేట్ పై మరో డౌట్?

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సరిపోదా శనివారం

By:  Tupaki Desk   |   6 May 2024 3:48 AM GMT
సరిపోదా శనివారం..రిలీజ్ డేట్ పై మరో డౌట్?
X

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సరిపోదా శనివారం. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకొని వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. వారం రోజులపాటు ఉండే కోపాన్ని ఒక్కరోజు మాత్రమే చూపించే వ్యక్తిగా నాని ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోరు మీద ఉన్న నాని సరిపోదా శనివారం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. నానితో వివేక్ ఆత్రేయ ఇదివరకే 'అంటే సుందరానికి' అనే మూవీ చేశారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

దీంతో ఈ సారి మాస్ కథాంశంతో నానికి సక్సెస్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆగష్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. అయితే సరిపోదా శనివారం చిత్రానికి రెండు వారల ముందు ఆగష్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఆ హైప్ కి తగ్గట్లుగానే సినిమాని స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే లాంగ్ రన్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఒక వేళ అదే జరిగితే సరిపోదా శనివారం సినిమా రిలీజ్ ను ఆగష్టు 29 నుంచి కాస్తా వెనక్కి జరుపుతారని టాక్ వినిపిస్తోంది.

అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ ఖాయం చేయొచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా గట్టిగా మూడు వారాలు మాత్రమే థియేటర్స్ లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. పుష్ప రిలీజ్ అయిన రెండు వారల తర్వాత సరిపోదా శనివారం రిలీజ్ కానుంది. ఈ రెండు వారాలలో మెజారిటీ ఆడియన్స్ పుష్ప ది రూల్ చూసేస్తారు. అందుకే సరిపోదా శనివారం వాయిదా వేయకపోవచ్చని మరో వర్గం నుంచి వినిపిస్తోన్న మాట.