Begin typing your search above and press return to search.

కాజల్ సత్యభామ.. రిలీజ్ అయ్యేది అప్పుడే..

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ కు జోడీగా యువ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 10:39 AM GMT
కాజల్ సత్యభామ.. రిలీజ్ అయ్యేది అప్పుడే..
X

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. రూట్ మార్చేసిన విషయం తెలిసిందే. యాక్షన్, ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ గా సత్యభామ మూవీ తెరకెక్కుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ కు జోడీగా యువ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. యాక్షన్ మోడ్‍ లో సీరియస్ క్యారెక్టర్ చేస్తుండడంతో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ 90 శాతం సినిమా పూర్తి చేశామని మేకర్స్ తెలిపారు. కాజల్ అగర్వాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ లు కంప్లీట్ చేశారని కొనియాడారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే17వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కాజల్ అగర్వాల్ సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ మ్యాప్ కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ తో పాటు మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.

ఈ మూవీతో దర్శకుడు శశికిరణ్ తిక్క నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. సూపర్ హిట్ మేజర్, గూఢచారి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు స్క్రీన్‍ప్లే కూడా అందిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో కాస్త డిఫరెంట్ గానే ఆలోచిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ డిఫరెంట్ గా ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఆమె ఇప్పుడు సత్యబామ అనే మరో డిఫరెంట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.