Begin typing your search above and press return to search.

బన్నీ టాలెంట్ చూసి షాకయ్యా : తారక్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 April 2024 3:30 PM GMT
బన్నీ టాలెంట్ చూసి షాకయ్యా : తారక్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకు తగ్గట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను రిలీజ్ చేసి.. సినిమాపై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశారు మేకర్స్.

టీజర్ లో పట్టు చీర కట్టుకుని, ముఖానికి రంగులతో, ఆభరణాలు, మెడలో దండలతో అమ్మవారి వేషంలో అల్లు అర్జున్ గెటప్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. పుష్పరాజ్‍ గా బన్నీ మరోసారి ఆ మార్క్ స్టైల్, స్వాగ్, గ్రేస్‍ ను ఓ రేంజ్ లో చూపించారు. నడకతో అల్లు అర్జున్ మెప్పించారు. చివరలో బన్నీ.. హుప్ అని అరవగానే అందరూ భయపడి వెనక్కి వెళ్లే షాట్ అయితే మామూలుగా లేదు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నతో పాటు సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ దేవరలో కూడా యాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగు ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు తారక్.. ఓ కన్నడ షోను కూడా వదులుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప-2లో బన్నీతో కలిసి పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు తారక్ పొన్నప్ప. పుష్ప ది రూల్‌ సినిమాలో హీరో అల్లు అర్జున్‌ కు, తనకు మధ్య యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు తారక్. గతంలో తనకు స్టంట్స్ చేసిన అనుభవం లేదని చెప్పారు. ఫైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు బన్నీ ఎన్నో కొత్త విషయాలు చెప్పారని, స్క్రీన్ ప్రెజెన్స్ కు సంబంధించిన సలహాలు ఇచ్చారని తెలిపారు.

బాడీ పొజిషన్స్‌ గురించి వివరించారని, బన్నీకి డ్యాన్స్ తో పాటు స్టంట్స్ పై ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి షాక్ అయ్యానని తారక్ తెలిపారు. అల్లు అర్జున్ గొప్ప నటుడు అని ప్రశంసించారు. తెలుగు సినిమాలకే తన ప్రాధాన్యత అని చెప్పారు తారక్. ఇక పుష్ప సీక్వెల్ లో హీరోకు, ఫహాద్ ఫాజిల్ పాత్ర భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అనేక యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.