Begin typing your search above and press return to search.

'రాబిన్‌హుడ్‌' డైరెక్టర్‌ ఇంట్లో రాబిన్‌హుడ్‌ చోరి

బీహార్ కా రాబిన్‌హుడ్‌ అంటూ ఇర్ఫాన్‌ పేరు దక్కించుకున్నాడు. ఇతడిపై 19 రాష్ట్రాల్లో చోరీ కేసులు నమోదు అవ్వడం విశేషం.

By:  Tupaki Desk   |   23 April 2024 8:11 AM GMT
రాబిన్‌హుడ్‌ డైరెక్టర్‌ ఇంట్లో రాబిన్‌హుడ్‌ చోరి
X

ఉన్నవాళ్ల ఇళ్లను దోచి, ధనవంతుల ఆస్తులను దోచి పేదవారికి ఖర్చు పెట్టే వారిని రాబిన్ హుడ్‌ అంటారు. ఈ కాన్సెప్ట్‌ తో చాలా సినిమాలు అనేక భాషల్లో వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తరహా దొంగతనం స్వయంగా రాబిన్‌హుడ్‌ సినిమాను రూపొందించిన దర్శకుడి ఇంట్లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... బీహార్ కు చెందిన ఇర్ఫాన్ అనే 34 ఏళ్ల దొంగ చాలా తెలివిగా, పోలీకులకు చిక్కకుండా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. కోట్ల రూపాయల డబ్బు మరియు బంగారు ఆభరణాలను దోచిన ఇర్ఫాన్‌ అందులో ఎక్కువ శాతం పేద వారికి ఖర్చు చేశాడట.

బీహార్ కా రాబిన్‌హుడ్‌ అంటూ ఇర్ఫాన్‌ పేరు దక్కించుకున్నాడు. ఇతడిపై 19 రాష్ట్రాల్లో చోరీ కేసులు నమోదు అవ్వడం విశేషం. ఏ రాష్ట్ర పోలీసులకు కూడా చిక్కకుండా తిరుగుతున్న ఇర్ఫాన్‌ ఇటీవల కొచ్చిలో దర్శకుడు జోషీ ఇంట్లో దొంగతనంకు పాల్పడ్డాడు.

మలయాళ దర్శకుడు జోషీ కొన్నాళ్ల క్రితం రాబిన్‌హుడ్‌ కాన్సెప్ట్‌ తో సినిమాను రూపొందించాడు. ఆ విషయం తెలుసో తెలియదో కానీ ఇర్ఫాన్‌ ఇటీవల దర్శకుడు జోష ఇంట్లో ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారు మరియు నగదు ఎత్తుకు పోయాడు.

ఎక్కడ దొంగతనం చేస్తే అక్కడి చుట్టు పక్కల పేద వారికి ఆ డబ్బును పంచడంతో పాటు, గ్రామాల అభివృద్ధికి సహాయం చేయడం ఇర్ఫాన్ కి ఉన్న అలవాటు. అందుకే జోషీ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇర్ఫాన్‌ పోలీసులకు దొరక్కూడదు అని కోరుకుంటున్నారట.