Begin typing your search above and press return to search.

వేదిక నడుము మాయ.. బికినీ కంటే ఘాటుగా..

నటిగా కూడా కొన్ని సినిమాలతో అమ్మడు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 11:30 AM GMT
వేదిక నడుము మాయ.. బికినీ కంటే ఘాటుగా..
X

రెండు పదుల వయసులోకి రాకముందే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అందాల వేదిక భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ బ్యూటీకి ఇప్పటివరకు ఇండస్ట్రీలో సాలిడ్ హిట్ అయితే పడలేదు. కానీ గ్లామరస్ బ్యూటీగా మాత్రం మంచి గుర్తింపు అయితే అందుకుంటుంది. నటిగా కూడా కొన్ని సినిమాలతో అమ్మడు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.


అయితే ఆమె బ్యాడ్ లక్ ఏమిటో కానీ పెద్ద సినిమాలలో అవకాశాలు మాత్రం అస్సలు రావడం లేదు. ఇక ఎ మాత్రం ఖాళీగా ఉండకుండా అమ్మడు ప్రతి ఏడాది రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ కనిపిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ పోస్ట్ చేసి కొన్ని ఫోటోలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ముఖ్యంగా తన నడుము అందాలతో ప్రతిసారి అమ్మడు సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల మరోసారి ఈ బ్యూటీ తన నడుముతో ఫోటోలకు ఫోజు ఇచ్చిన విధానం కుర్రాళ్ళ మనసులను దోచేసింది. గతంలో బికినీలో కూడా దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక వేదిక మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. మొదట మోడల్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. అయితే అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో అలాగే తెలుగులో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో బాణం సినిమాతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుని అనంతరం మీడియం రేంజ్ సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

గతంలో నందమూరి బాలకృష్ణ తో రూలర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అది సక్సెస్ అయితే అమ్మడికి ఓ వర్గం స్టార్ హీరోలతో మరిన్ని అవకాశాలు వచ్చేవి. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక రీసెంట్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రజాకర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అమ్మడు కొద్దిసేపు కనిపించింది.

ఇక ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే ప్రస్తుతం వేదిక దాదాపు ఏడు సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఫియర్ - జంగల్ అనే రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా తమిళంలోనే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.