Begin typing your search above and press return to search.

వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం... లెక్కలివే!

2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అమెరికా పౌరసత్వం పొందిన దేశంగా భారత్ నిలిచింది.

By:  Tupaki Desk   |   22 April 2024 2:30 PM GMT
వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం... లెక్కలివే!
X

చాలామంది భారతీయులకు అమెరికా పౌరసత్వం ఒకపెద్ద కల అని అంటారు. ఈ క్రమంలో చాలా మంది ఆ కలను నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అమెరికా పౌరసత్వం పొందిన దేశంగా భారత్ నిలిచింది.

అవును... 2022లో అమెరికా పౌరసత్వం పొందిన వారిలో అత్యధికులు మెక్సికోకు చెందినవారు కాగా.. ఆ తర్వాత స్థానంలో ఉన్నది భారతీయులు కావడం గమనార్హం. ఈ క్రమలో ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్‌ షిప్‌ లభించింది. ఈ నేపథ్యంలో విడుదలైన వివరాలను ఇప్పుడు చూద్దాం...!

2022 నాటికి అమెరికాలో 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అమెరికా జనాభా 33.3 కోట్లు కాగా... అందులో ఈ విదేశీయుల జనాభా వాటా 14శాతానికి సమానం అన్నమాట! వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా పేర్కొనగా... ఆ ఏడాదిలో మొత్తం 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారని "కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆరెస్స్)" నివేదిక వెల్లడించింది.

ఇదే క్రమంలో... భారత్‌ లో పుట్టి అమెరికాలో ఉంటున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని ఈ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో... 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా... అమెరికా సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జన్మించిన దేశంతో పాటు కనీసం ఐదేళ్ల పాటు లీగల్‌ పర్మినెంట్‌ రెసిడెన్సీ అయ్యి ఉండాలి. వీరిలో... వెనిజువెలా, హోండురస్‌, గ్వాటిమాలా, మెక్సికో, ఎల్‌ సాల్వెడార్‌, బ్రెజిల్‌ వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుండగా... వియత్నాం, రష్యా, జమైకా, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు.

దేశాలవారీగా 2022లో అమెరికన్ పౌరులుగా మారిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది!

మెక్సికన్లు - 1,28,878

ఇండియన్స్ - 65,960

ఫిలిప్పీన్స్‌ - 53,413

క్యూబా - 46,913

డొమినికన్‌ రిపబ్లిక్‌ - 34,525

వియత్నాం - 33,246

చైనా - 27,03