Begin typing your search above and press return to search.

విశాఖ చుట్టూ విష వలస రాజకీయం!

విశాఖ రాజధాని అన్న ఆరు దశాబ్దాల కలను నెరవేర్చే అవకాశం ఓటు రూపంలో ప్రజలకు ఇపుడు వచ్చింది అని మేధావులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 8:30 AM GMT
విశాఖ చుట్టూ విష వలస రాజకీయం!
X

విశాఖ సహా ఉత్తరాంధ్రా అంటే మంచికి మారు పేరు ఇక్కడ నూటికి తొంబై శాతం మంది ఆర్థికంగా వెనకబడిన వార్గాలే. ఉపాధి కోసం ఇక్కడ జనాలు ఇతర ప్రాంతాలకు పోతూంటే వ్యాపారం ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చిన ఇతర జిల్లాల వారు విశాఖలో రాజకీయాన్ని అందుకున్నారు.

తమకు ఉన్న అంగబలం అర్ధబలంతో విశాఖలో రాజకీయాన్ని అనుకూలం చేసుకున్నారు. కీలక పదవులు అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ పదవి వలసవాదుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దాని వల్ల విశాఖకు జరిగిన లాభం లేదు కానీ నష్టం భారీ స్థాయిలో ఉంది.

విశాఖ సమస్యలను లేవనెత్తకుండా తమ సొంత జిల్లాల ప్రయోజనం కోసం వలసవాదులు పాకులాడదం అంతా చూసారు. విశాఖకు రైల్వే జోన్ రావాలీ అంటే విశాఖ వద్దు విజయవాడ ముద్దు అని గతంలో తీర్మానం చేసిన వారిలో విశాఖ వలసవాదులు ఉన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు విశాఖకు కాకుండా విజయవాడకు తరలించుకుని పోయేందుకు చూశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ ప్రభుత్వం అంటే విశాఖ ఓట్లతో గెలిచి జై అమరావతి అన్న ప్రజా ప్రతినిధులను కూడా చూశారు. విశాఖకు న్యాయం జరగాలంటే వలస పాలకులను పక్కన పెట్టి విశాఖ మూల వాసులకే పట్టం కట్టాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.

ఉత్తరాంధ్రా మేధావుల సంఘం అభివృద్ధి వేదికలు కూడా ఇదే నినాదం ఇస్తున్నాయి. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలు పచ్చని అడవుల మధ్య ఉన్నవి. ఇక్కడ ప్రజలకు కల్లా కపటం తెలియదు. వారి తమ మంచిని పదిమందికీ పంచే వారు. అలాంటి విశాఖలో సొంత వారు రాజ్యం చేయడం లేదు వలసవాదుల పెత్తనం ఎక్కువ అయిపోయింది. విశాఖ వంటి మెగా సిటీని రాజధానిగా చేసుకుంటే ఏపీకి గ్రోత్ ఇంజన్ అవుతుందని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

అంతదాకా ఎందుకు శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ అప్పుడు అదే విషయం చెప్పింది. దేశవ్యాప్తంగా మేధావులంతా అమరావతి వద్దు వైజాగ్ ముద్దు అని చెప్పినా ఆనాటి పాలకుడు చంద్రబాబు అమరావతినే ఎంచుకున్నాడు. ఆయన ఎవరి మాట వినకుండా ఒంటెత్తు పోకడలతో వెళ్లిపోయాడు. ఆఖరికి కేంద్రంలోని మోదీ, అమిత్ షా ఆంధ్రాకు రాజధాని తామే కడతామని చెప్పినా, మీరెవరు మా రాజధాని కట్టడానికి మీకేం అధికారం ఉందని చెప్పారని తన చేతిలోకే అంతా తీసుకున్నారు అని ప్రచారంలో ఉంది.

నిజానికి విభజన ఏపీకి తొలి సీఎం అయ్యే చాన్స్ చంద్రబాబుకు రావడం అదృష్టం. అలాంటిది ఆయన అప్పటికే రెడీ మేడ్ సిటీగా ఉన్న విశాఖను రాజధానిగా చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఒనగూడేది అని కూడా మేధావులు చెబుతారు.

అదే విధంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైకి ధీటుగా పోటీపడగలిగిన విశాఖ నగరాన్ని ఎంచుకోకుండా, కేవలం తమ సామాజికవర్గానికి ప్రయోజనాలు చేకూర్చేలా చంద్రబాబు వందేళ్ళు అయినా అభివృద్ధి చెందిన అమరావతిని రాజధానిగా ఎంచుకోవడంలోనే అసలైన కుతంత్రం ఉందని అంటున్నారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ రాజధాని అంటే నాటి నుంచే విశాఖలో ప్రజాప్రతినిధులుగా నెగ్గిన వలస పాలకులు కూడా విషం కక్కడం మొదలెట్టారు వారు విశాఖ ఓట్లతో గెలిచి వేరే ప్రయోజనాల కోసం పనిచేయడం దారుణం అనే స్థానిక మేధావులు అంటున్నారు.

విశాఖ రాజధాని అంటే ప్రకృతి విలయాలు వస్తాయని ప్రచారం చేస్తారు, విశాఖకు ఆ హోదా లేదని చెబుతారు అలా విశాఖను ఎదగనీయకుండా ఉత్తరాంధ్రాను బాగుపడనీయకుండా చేస్తున్నారు అని మూలవాసులు అయిన ఉత్తరాంధ్రా మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ రాజధాని రావాలని బలమైన ఆకాంక్ష ఉంది. దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే ఈ ప్రాంతంలోనే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయి అంటున్నారు. అదే విధంగా తమకు ఉపాధితో పాటు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. ఈ నేపధయంలో ఉత్తరాంధ్ర మీద జరుగుతున్న విష ప్రచారానికి ఓటుతో బుద్ధి చెబుతామని ఉత్తరాంధ్ర ప్రజాసంఘాలు ఏకతాటిపైకి వచ్చి చెబుతున్నాయి.

విశాఖ రాజధాని అన్న ఆరు దశాబ్దాల కలను నెరవేర్చే అవకాశం ఓటు రూపంలో ప్రజలకు ఇపుడు వచ్చింది అని మేధావులు అంటున్నారు. విశాఖ రాజధానికి అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలనే ఎన్నుకోవాలని కోరుతున్నారు.