Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై అత్యధిక కేసులు... ఇంకో ఏడైతే సెంచరీ!!

అవును... నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దాఖలులు ఊపందుకున్నాయి.

By:  Tupaki Desk   |   23 April 2024 6:44 AM GMT
ఈ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై అత్యధిక  కేసులు... ఇంకో ఏడైతే సెంచరీ!!
X

ఏపీలో అసలు సిసలు ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని కూటమి.. మరోసారి గెలిచి అధికారం కంటిన్యూ చేయాలని వైసీపీ బలంగా ఫిక్సయ్యాయి! ఈ సమయంలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల కేసులు హాట్ టాపిక్ గా మారాయి!

అవును... నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దాఖలులు ఊపందుకున్నాయి. ఈ సమయంలో కొన్ని నామినేషన్లు, అఫిడవిట్‌ లు.. ఆర్థిక కోణం నుండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే... మరికొన్ని మాత్రం క్రిమినల్ కేసుల సంఖ్యతో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన నామినేషన్ తాజాగా తెరపైకి వచ్చింది. ఆ అభ్యర్థి... చింతమనేని ప్రభాకర్!

చాలా సస్పెన్స్ లు, ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు దెందులూరు ఎమ్మెల్యే టిక్కెట్‌ ను దక్కించుకున్న చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన కేసుల వివరాలు వైరల్ గా మారాయి. తనపై ఇప్పటివరకూ 93 కేసులు ఉన్నట్లు చింతమనేని తన నామినేషన్‌ లో పేర్కొన్నారు. దీంతో... ఈ విషయంలో చింతమనేని సరికొత్త రికార్డ్ సృష్టించారని అంటున్నారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్‌ పై 93 కేసులే కాకుండా రౌడీషీట్ కూడా ఉంది.

ఇదే సమయంలో ఈయన తర్వాత స్థానాల్లో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. కాకపోతే వారు ఈ స్థాయిలో సెంచరీకి చేరువలో లేరు!! వీరిలో... పల్నాడు జిల్లా గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుపై 22 కేసులు.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యపై 23 కేసులు ఉన్నాయి.

అదేవిధంగా... శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి పేరిట రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 పోలీసు కేసులున్నాయి. ఇదే క్రమంలో... నెల్లూరు లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిపై ఆదాయ పన్నుకు సంబంధించి 6 కేసులున్నాయి. హైదరాబాద్‌ లోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో ఓ కేసు పెండింగ్‌ లో ఉంది.

ఇదే క్రమంలో... ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ పై 6 పోలీసు కేసులున్నాయి. వీటిలో సీబీఐ, ఈడీ కేసులు 2 ఉన్నాయి. ఇక నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై 8 కేసులున్నాయి. వీటిలో వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య తో పాటు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులున్నాయి.

మంగళగిరి టిడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్ లలో 23 కేసులున్నాయి. విశాఖపట్నం లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌ పై బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లో రెండు కేసులున్నాయి. అదేవిధంగా... ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డిపై 8 కేసులుండగా... నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై 7 కేసులున్నాయి!