Begin typing your search above and press return to search.

2019లో 372 కోట్లు-2024లో 602 కోట్లు... జ‌గ‌న్ ఆస్తులు!!

ఈ నేప‌థ్యంలో ఆయ‌న చిన్నాన్న వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి.. సోమ‌వారం నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు.

By:  Tupaki Desk   |   23 April 2024 4:29 AM GMT
2019లో 372 కోట్లు-2024లో 602 కోట్లు... జ‌గ‌న్ ఆస్తులు!!
X

ఏపీ సీఎం జ‌గ‌న్ ఆస్తులు 2019లో 372 కోట్లు-2024లో 602 కోట్లకు పెరిగాయి. అంటే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ ఆస్తులు రూ.230 కోట్ల మేర‌కు పెరిగింది. ఈ విష‌యాన్ని ఆయ‌న తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో పేర్కొ న్నారు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చిన్నాన్న వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి.. సోమ‌వారం నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు. దీనిలో జ‌గ‌న్ కుటుంబం ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి.. గ‌డిచిన ఐదేళ్ల‌లో జ‌గ‌న్ కుటుంబం ఆస్తి 230 కోట్ల మేర‌కు పెరిగింది. మొత్తం ఆస్తులు రూ.602 కోట్లుగా చూపించారు. ఇక‌, కేసుల విష‌యానికి వ‌స్తే.. సీఎం జ‌గ‌న్‌పై 26 కేసులు ఉన్నాయి.

ఇవీ వివ‌రాలు..

+ జ‌గన్‌కు ఉన్న ఆస్తులు: 483,08,35,064

+ వైఎస్ భార‌తి ఆస్తులు: 119,38,07,190

+ జ‌గ‌న్ చేతిలో ఉన్న న‌గ‌దు: 7000

+ వైఎస్ భార‌తి చేతిలో ఉన్న న‌గ‌దు: 10,022

+ ఇద్ద‌రు కుమార్తెల పేరిట ఉన్న న‌గదు: 16000

+ జ‌గ‌న్ కుటుంబానికి సొంత కారు లేదు

+ వైఎస్ భార‌తికి రూ.5.29 కోట్ల విలువైన 6.47 కిలోల బంగారం ఉంది

+ ఇద్ద‌రు కుమార్తెలకు ఉన్న బంగారం విలువ‌: రూ.9.7 కోట్లు

+ జ‌గ‌న్ క‌డుతున్న ప‌న్నులు : 4.56 కోట్లు

స్థిరాస్తులు

+ ఇడుపుల పాయ‌లో జ‌గ‌న్‌కు 35.5 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది

+ వ్య‌వ‌సాయేత‌ర భూముల విలువ‌: రూ.46.78 కోట్లు

+ వైఎస్ భార‌తికి పులివెందుల, రాయ‌దుర్గం, తాడేప‌ల్లిలో ఉన్న స్థిరాస్తుల విలువ‌: 56.92 కోట్లు

+ జ‌గ‌న్ పెద్ద‌కుమార్తె పేరుతో క‌ర్ణాట‌క‌, ఇడుపులపాయ‌లో 4.5 ఎకరాల భూమి ఉంది.

+ జ‌గ‌న్ చిన్న కుమార్తె పేరుతో పాలెంప‌ల్లె, కె.ఎల్ల‌మ‌వారిపాలెంలో రూ.1.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

+ భార‌తి పేరుతో రూ.5.29 కోట్ల విలువైన 6.47 కిలోల బంగారం, వ‌జ్రాలు ఉన్నాయి.

పెట్టుబ‌డులు

+ భార‌తి సిమెంట్స్‌లో జ‌గ‌న్ పెట్టుబ‌డి: 36 కోట్లు

+ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.65.19 కోట్లు

+ స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ ఇండ‌స్ట్రీస్‌లో రూ.27.60 కోట్లు

+ మొత్తంగా జ‌గ‌న్ పేరుతో ఉన్న పెట్టుబ‌డులు: 263.64 కోట్లు

కేసులు

+ సీఎం జ‌గ‌న్‌పై 26 కేసులు ఉన్నాయి.

+ 11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి.

+ ఇత‌ర కేసులు(2014-19 మ‌ధ్య‌) 6 కేసులు న‌మోద‌య్యాయి.