Begin typing your search above and press return to search.

బొత్సా ఝాన్సీ ఎంపీ అయితేనే విశాఖ అభివృద్ధి పరుగులు

ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి రైల్వే గేట్లు పెట్టించి ఎందరో ప్రాణాలు కాపాడిన నేతగా పేరు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:15 PM GMT
బొత్సా ఝాన్సీ ఎంపీ అయితేనే విశాఖ అభివృద్ధి పరుగులు
X

ఆమె రెండు సార్లు ఎంపీ. ఒకసారి బొబ్బిలి నుంచి మరోసారి విజయనగరం నుంచి ఎంపీగా గెలిచారు. ఉత్తరాంధ్ర సమస్యల మీద పార్లమెంట్ వేదికగా గళమెత్తారు. అనేక సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. ఒకనాడు ఉత్తరాంధ్రాలో రైల్వే ట్రాకులకు గేట్లు ఉండేవి కావు. అలా ఎంతో మంది మరణిస్తూ ఉండేవారు.

ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి రైల్వే గేట్లు పెట్టించి ఎందరో ప్రాణాలు కాపాడిన నేతగా పేరు తెచ్చుకున్నారు. విశాఖ సమస్యలను ఆనాడు ఆమె ప్రస్తావించారు. ఉత్తరాంధ్రాలో పుట్టి పెరిగిన ఆమెకు ఈ ప్రాంతం సమస్యలు ఏంటో తెలుసు. వాటికి పరిష్కారం ఎలాగో కూడా తెలుసు. అందుకే ఆమె ఈసారి ఘనత వహించిన విశాఖ నుంచి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

తనకు ఈసారి చాన్స్ ఇస్తే ఉత్తరాంధ్రాను మరింతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రా మీద దృష్టి పెట్టింది. విశాఖను రాజధానిగా చేసుకుని పాలిస్తామని చెబుతోంది. విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా సిటీ. సీ వే రోడ్ వే. రైల్ వే, ఎయిర్ వే కనెక్టివిటీ ఉన్న విశాఖ మీద అందరి చూపూ ఉంది.

దానికి ప్రభుత్వం దన్ను ఉంటే విశాఖ గ్లోబల్ సిటీ కావడం అన్నది చాలా ఈజీ. రాబోవు రోజుల్లో విశాఖ రాజధాని కావడం తథ్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒకటికి పదిసార్లు ప్రతీ వేదిక మీద చెప్పుకుని వస్తున్నారు. దాంతో ఈ మాట ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక చూస్తే కనుక ఈ ఒక్క మాటతో విశాఖపట్నంపై గ్లోబల్ మార్కెట్ దృష్టి పడిందని అంటున్నారు. దీంతో పెట్టుబడులు ఆటోమేటిక్ గా వాటంతటవే వస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం తరఫు నుంచి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసి పెట్టింది.

ఇలాంటి సమయంలో విశాఖపట్నం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీని గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదు సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి వాటిని పరిష్కరించడంలో చొరవ చూపిస్తారనే భావం ప్రజల్లోకి వచ్చిందని అంటున్నారు.

విశాఖ ఎంపీ అంటే అది ఎంతో పవర్ ఫుల్ పోస్ట్. ఆ పదవిలోకి వచ్చేవారికి అనుభవం ఉండాలి. ఆ పదవిని మోసే నేర్పూ ఓర్పూ ఉండాలి. అలా అన్నీ ఉన్న బొత్స ఝాన్సీలక్ష్మి సరైన అభ్యర్ధిగా సరైన సమయంలో పోటీకి దిగారు అని అంటున్నారు.

విశాఖ అన్నది ఉత్తరాంధ్రకే గేట్ వే లాంటిది. విశాఖ కనుక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే ఇతర జిల్లాలూ బాగుపడతాయి. పైగా విశాఖ ఎంపీ అంటే కేవలం విశాఖ గురించే కాదు ఉత్తరాంధ్రా గురించి తెలిసి ఉండాలి. అలా చూస్తే కనుక ఉత్తరాంధ్రాలో సమస్యలు, వెనుకబాటు తనం వీటన్నింటిపై బొత్స ఝాన్సీకి ఎంతో అవగాహన ఉంది.

ఈ ప్రాంతం సమస్యలు అన్నీ ఆమెకు వేళ్ళ మీదనే ఉంటాయి. ఆమె వాటిని అన్నింటిపై సమగ్రంగా రాసుకుని ఆ సమస్య సీరియస్ నెస్ ని చెప్పడంతో పాటుగా అదెంత అవసరమో గతంలో ఎంపీగా ఉన్నపుడు పార్లమెంటులో చెప్పి పనులన్నీ చేయించగలిగారని అంటారు. ఇదే ఆమె విజయ రహస్యం అని కూడా చెబుతారు. అలా బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా ఉంటే కనుక మూడు జిల్లాలూ అనూహ్యంగా అభివృద్ధిని సాధిస్తాయని అంటున్నారు.

ఇక ఆమెకు పోటీగా టీడీపీ నిలబెట్టిన వారు శ్రీ భరత్. ఈయన పుట్టుకతోనే గొప్పవాళ్లింట్లో పుట్టడంతో ఆగర్భ శ్రీమంతుడిగా ఉన్నారు. అంతే కాదు, కారులో వెళ్లి, కారులో వచ్చి ఏసీ గదుల్లో చదువుకుని వచ్చిన వారు. ఆయనకు ప్రజా సేవ చేస్తాను అంటున్నారు. అయితే ఆయన మాటలను ప్రజలు ఎంతవరకు నమ్మగలరని అంటున్నారు. కేంద్రంలోని అధికార పార్టీలతో చంద్రబాబు స్నేహాన్ని కొనసాగించడం, తమ సొంత సామాజిక వర్గం పనులు చేయించుకోవడంలో ఎంతో సమర్థత ఉన్న నేతగా ఆయన పేరుపొందాడు. అందుకు తగినట్టుగానే ఆ పార్టీ ఎంపీలు ఉంటారు తప్ప తమను గెలిపించిన ప్రాంతానికి మేలు చేయడానికి ఏ ఒక్కరు కూడా ప్రజలకోసం పార్లమెంటులో నోరు మెదపరనే సంగతి అందరికీ తెలిసిందే అంటున్నారు.

ఇలా చూసుకుంటే కనుక ప్రజాసేవలో తరిస్తూ ప్రజల కోసం పోరాడుతూ ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా తనను తాను రుజువు చేసుకున్న బొత్సా ఝాన్సీ లక్ష్మీ ఒకవైపు ఉంటే పార్టీ ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా భావించే శ్రీభరత్ మరొక వైపు ఉన్నారని అంటున్నారు.

ప్రజలవైపు పోరాడే బొత్సా ఝాన్సీని మళ్లీ గెలిపించుకోవాలి. విశాఖ రాజధానిని అభివృద్ధి చేసుకోవాలి అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీంతో విశాఖ ఎంపీగా ఆమె గెలుపు తథ్యమని అంటున్నారు. ఒక విధంగా ఇదే వైసీపీలోనూ ధీమా పెంచుతోంది అని అంటున్నారు.