Begin typing your search above and press return to search.

కొంపెల్లి మాధవీలత ఈసారి సెంట్రల్ మినిస్టర్ నా ?

ఈ పరిణామాలు అన్నీ జాగ్రత్తగా చూస్తున్న వారు కొంపెల్లి మాధవీలత సెంట్రల్ మినిస్టర్ అవడం ఖాయమని అంటున్నారు

By:  Tupaki Desk   |   23 April 2024 12:09 PM GMT
కొంపెల్లి  మాధవీలత ఈసారి సెంట్రల్ మినిస్టర్ నా ?
X

ఒక మహిళా డాక్టర్ ఒక్కసారిగా తెలంగాణా రాజకీయాలో హైలెట్ అవుతున్నారు. ఆమెను తీసుకుని వచ్చి ఏకంగా హైదరాబాద్ వంటి మజ్లీస్ హార్డ్ కోర్ సీటుకు ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కు అయ్యారు. అసలు ఎవరీ మాధవీలత అన్న చర్చ కూడా మొదలైంది.

హైదారాబాద్ ఎంపీ సీటు విషయానికి వస్తే గత మూడున్నర దశాబ్దాలుగా మజ్లిస్ చేతులలోనే ఉంది. 1952లో హైదరాబాద్ లొక్ సభకు తొలిసారి ఎన్నికలు జరిగితే అహ్మద్ మొహియుద్దీన్ ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఎంతో మంది హిందువులు ఇదే సీటు నుంచి గెలిచారు. ఇక కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది. ఆఖరుకు ఇండిపెండెంట్లు గెలిచారు

అయితే ఈ సీటు మీద తొలిసారి కన్నేసి మజ్లీస్ తరఫున గెలిచిన వారు ఆ పార్టీ అధినేత సలావుద్దీన్ ఓవైసీ. ఆయన 1989లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. ఆ తరువాత 2004 వరకూ ఆయనే ఎంపీ. 2004 నుంచి ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా కొనసాగుతున్నారు.

బీజేపీ ఈ సీటు మీద మోజు పడి భారీ ఫైటింగ్ ఇస్తూ వస్తోంది. బద్ధం బాల్ రెడ్డి వంటి వారు హైదరాబాద్ ఎంపీ సీటుకి బీజేపీ నుంచి పోటీ పడి సలావుద్దీన్ ఒవైసీ మెజారిటీని కేవలం అరవై వేల దాకా తగ్గించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక అసదుద్దీన్ మెజారిటీలు 74 వేలతో మొదలై 2019 ఎన్నికల నాటికి రెండు లక్షల ఎనభై వేల పై దాకా చేరాయి. ఆయన్ని ఢీ కొట్టే వారు లేరు అన్న భావన అయితే కలిగించారు. ఇక్కడ బీజేపీ గత నాలుగు ఎన్నికల నుంచి చూసుకుంటే పోటీ చేసిన తరువాత వచ్చిన ఓట్లు తీసుకుంటే 2004లో రెండు లక్షల ఎనభై వేల ఓట్లు, 2009లో 75 వేలు, 2014లో మూడు లక్షల 11 వేలు , 2019లో 2 లక్షల 35 వేలుగా ఉన్నాయి.

ఇక గత రెండు ఎన్నికల నుంచి భగవంత్ రావు బీజేపీ తరఫున పోటీ చేశారు. ఇపుడు అనూహ్యంగా మాధవీలతను పోటీలోకి దించారు. హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో 2009లో ఫాతీమా ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. ఆ తరువాత ప్రధాన పార్టీల నుంచి మహిళలు పోటీ చేసిన దాఖలాలు లేవు

అలాంటిది బీజేపీ హైదరాబాద్ సీటుని కొట్టాలని చూస్తోంది. ఒక మహిళకు రాజకీయంగా అనుభవం లేని కొంపెల్లి మాధవీలతకు టికెట్ ఇచ్చింది. దాంతో ఆమె పలుకుబడి బీజేపీ పెద్దల వద్ద ఆమెకు ఉన్న గౌరవం ఇవన్నీ ఒక్కసారిగా చర్చకు వస్తున్నాయి.

ఆమె ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు పొందారు. హిందూత్వ నినాదంతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఆమెకు సీటు దక్కడం వెనక ఆరెస్సెస్ కూడా కీలక పాత్ర పోషించింది అని అంటున్నారు. ఆమె హైదరాబాద్ లో ఒక వైద్యురాలిగా ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు.

హిందూత్వనే ప్రాణంగా భావించే ఆమె బీజేపీకి దొరికిన కొత్త ఆయుధంగా భావిస్తున్నారు. ఆమె ట్విట్టర్ ని మోడీ అనుసరిస్తున్నారు అంటే ఆమెకు ఉన్న ప్రాభవం బీజేపీలో ఎలాంటిదో అర్ధం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. అంతే కాదు ఆమె ఆమె ప్రసంగాలను చూసి ట్విట్టర్ ద్వారా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

దీంతో ఆమెకు పార్టీలో ఒక్క సారిగా హైప్ ఎక్కువ అయింది అని అంటున్నారు. ఆమె డైరెక్ట్ గా బీజేపీ జాతీయ నేతలతోనే టచ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. ఆమె ప్రచారాన్ని వారే డైరెక్ట్ చేస్తున్నారు. ఆమెని ఎంపిక చేయడం వెనక బీజేపీ జాతీయ నాయకత్వం స్పేషల్ ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. ఆమె ప్రచారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లోకల్ లీడర్స్ తో కో ఆర్డినేట్ చేయాలన్న నేరుగా జాతీయ నాయకత్వమే జోక్యం చేసుకుంటోంది అని కూడా అంటున్నారు.

అంతలా బీజేపీ జాతీయ నాయకత్వానికి మాధవీలత బాగా దగ్గర అయిపోయారు అని అంటున్నారు. హైదారాబాద్ వంటి సిటీ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత మీద జాతీయ మీడియా కూడా ఫుల్ అటెన్షన్ పెట్టేసింది. ఇక ఆమె బీజేపీలో చేరడం హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మకమైన సీటు నుంచి ఎంపీగా పోటీ చేయడం అంతా బీజేపీ ఆరెస్సెస్ స్కెచ్ అని అంటున్నారు. ఆమె వంటి విద్యాధికురాలు లేడీ ఫైర్ బ్రాండ్ ని పార్టీలోకి తీసుకుని రావడం ద్వారా బీజేపీ కొత్త తరాన్ని ఆకట్టుకోవాలని చూస్తోంది.

ఈ పరిణామాలు అన్నీ జాగ్రత్తగా చూస్తున్న వారు కొంపెల్లి మాధవీలత సెంట్రల్ మినిస్టర్ అవడం ఖాయమని అంటున్నారు. ఆమె గెలిస్తే కచ్చితంగా కేంద్ర మంత్రిగా అవడం ఖాయం. ఎందుకంటే మూడున్నర దశాబ్దాలుగా మజ్లీస్ చేతిలో ఉన్న హైదరాబాద్ గెలుచుకుని బీజేపీ దీర్ఘకాలం కలను నెరవేర్చిన మాధవీలతను ఆ పార్టీ విశేష ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర మంత్రిగా చేస్తుంది అని అంటున్నారు. ఒక వేళ ఓడినా కూడా ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అదే హైదరాబాద్ మీద మరోసారి అయినా జెండా ఎగరేసేలా చర్యలు తీసుకుంటుంది అని అంటున్నారు. సో మాధవీలత కేంద్ర మంత్రి అని అంటున్నారు. ఇది రాసి పెట్టుకోవాలి అని కూడా అంటున్నారు.