Begin typing your search above and press return to search.

మోడీ మాస్టారు కామెంట్స్ : టీడీపీ జనసేనలకు తలనొప్పేనా ?

దేశంలో మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 April 2024 3:40 AM GMT
మోడీ మాస్టారు కామెంట్స్ : టీడీపీ జనసేనలకు తలనొప్పేనా ?
X

దేశంలో మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. జగన్ వల్ల అన్ని విధాలుగా దెబ్బ తిన్న ఏపీ కోలుకోవాలంటే కేంద్ర సాయం తప్పనిసరి అని అంటున్నారు. అది నిజమే. ఏపీకి కేంద్రం మద్దతు అన్ని విధాలుగా అవసరం. బీజేపీతో పొత్తు వల్ల దానితో పాటుగా ఏపీలో వ్యవస్థలను సక్రమంగా పనిచేసేలా చూసుకోవడం వంటివి కూడా ఉన్నాయి. ఇంకా తెర వెనక కూడా మరెన్నో ఆశలు ఉన్నాయని చెబుతారు.

సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీజేపీ వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ పార్టీ ముస్లిం మైనారిటీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, బలహీన వర్గాలు దూరం అవుతారని భయాలు ఉన్నాయని అంటున్నారు. వీటికి అదనంగా ఏపీలో చూస్తే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, పోలవరం నిధులు ఇవ్వడం లేదు, రాజధానికి ఆసరాగా ఉండటం లేదు, ఆఖరుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న గుదిబండ కూడా ఉంది.

పోనీలే వీటికి కూడా ఎదో విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు అనుకున్నా బీజేపీతో పొత్తు కుదిరిన మరునాడే యూనిఫాం సివిల్ కోడ్ ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. దాంతో ప్రధానంగా ఒక వర్గం గుర్రుగా ఉందని టాక్ ఉంది.

ఇపుడు మోడీ తన ప్రసంగాలలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అని ఇండియా కూటమి మండిపడుతోంది. ఇంతకీ మోడీ ఏమిటి అన్నారు అంటే ఆయన ఎన్నికల వేళ ముస్లిమ్స్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఎన్నికలు వచ్చేసరికి ముస్లిమ్స్ కి కాంగ్రెస్ దన్నుగా ఉంటుందని ఆరోపించారు.

కేంద్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం ముస్లిం లకు పంచుతుందని హాట్ కామెంట్స్ చేసారు. దేశంలో వనరుల మీద మైనారిటీలతో తొలి హక్కు అని యూపీఏ హయాంలో పేర్కొన్నారు అని కూడా ఆయన చెప్పడం విశేషం.

ఇలా మోడీ చేసిన ఈ కామెంట్స్ ఏపీలో టీడీపీ జనసేలకు బిగ్ ట్రబుల్ గా మారుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే మైనారిటీలు వైసీపీ వైపు టర్న్ అయ్యారు అని టాక్ నడుస్తోంది. దానికి మరింతగా ఆజ్యం పోసేలా మోడీ మాస్టర్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీకి ఆ కామెంట్స్ వల్ల లాభమే కానీ నష్టం ఉండదు, కానీ ఏపీలో టీడీపీ జనసేనల పరిస్థితి మాత్రం కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.

అసలు మోడీ కామెంట్స్ ని వ్యతిరేకించాలా లేక సమర్ధించాలా అన్న సంశయంతో టీడీపీ జనసేన ఉన్నాయని అంటున్నారు. ఏపీలో చూస్తే ఏకంగా 18 నుంచి ఇరవై శాతం వరకూ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. మోడీ తాజా వ్యాఖ్యలతో కూటమి మీద ఈ ప్రభావం గట్టిగానే పడుతుందని అంటున్నారు.

ఇక మైనారిటీలకు తాము రక్షణగా ఉంటామని ఒక వైపు చంద్రబాబు హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ మోడీ కామెంట్స్ తో మొతానికి మొత్తం ప్రచారమే తుడిచిపెట్టుకుని పోయింది అని అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు కూటమిలో ఉన్న బీజేపీ వల్లనే టీడీపీ జనసేన కూడా నిండా మునగబోతున్నా యా అని కూడా తలలు పట్టుకుంటున్న నేపధ్యం ఉందిట.