Begin typing your search above and press return to search.

'నా కుమార్తె గురించి కాదు.. నీ భార్యలు గురించి చెప్పు'... పవన్ పై ముద్రగడ ఫైర్!

సార్వత్రిక ఎన్నికల వేళ పవన్ వర్సెస్ ముద్రగడ వార్ పీక్స్ కి చేరుకుంటుంది

By:  Tupaki Desk   |   6 May 2024 9:43 AM GMT
నా కుమార్తె గురించి కాదు.. నీ భార్యలు గురించి చెప్పు... పవన్ పై ముద్రగడ ఫైర్!
X

సార్వత్రిక ఎన్నికల వేళ పవన్ వర్సెస్ ముద్రగడ వార్ పీక్స్ కి చేరుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు ముద్రగడ పద్మనాభం. ప్రధానంగా... బహిరంగ సభలో తన కుమార్తెను పవన్ కల్యాణ్ ప్రజలకు పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో పవన్ కల్యాణ్ చిచ్చుపెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు ప్రస్థావించారు.

అవును... బహిరంగ సభలో తన కుమార్తెను ప్రజలకు పరిచయం చేయడంపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఇందులో భాగంగా... తనతో బంధం తెంచుకున్న వ్యక్తిని "ముద్రగడ కుమార్తె" అంటూ ఎలా పరిచయం చేస్తారని నిలదీశారు. ఆమె మామగారి పేరుతోనో, భర్త పేరుతోనో పరిచయం చేయవచ్చు కదా అన్నారు. ఇప్పుడు ఆమెకు ముద్రగడ అనే ఇంటి పేరు కూడా లేదని తెలిపారు.

అయినా సరే ముద్రగడ కుమార్తె అని ఆమెను ప్రజలకు పరిచయం చేయడానికి సిగ్గులేదా పవన్ కల్యాణ్ అంటూ నిప్పులు చెరిగారు ముద్రగడ పద్మనాభం. ఇదే తరహాలో ఇద్దరు భార్యలనూ వేదికపైకి తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేయ్ అంటూ ఫైర్ అయ్యారు. “ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాను.. ఇదిగో మూడో భార్య” అంటూ ప్రజలకు పరిచయం చేయవచ్చు కదా అంటూ నిలదీశారు!

ఇదే సమయంలో... "మీ కుటుంబంలోని అమ్మాయిల విషయాలు మాకు తెలియవా.. మీ అన్న కుమార్తె పబ్‌ లో తాగి డ్యాన్సులేస్తుంటే పోలీసులు పట్టుకెళ్లలేదా..?" అని ప్రశ్నించిన ముద్రగడ... మరో అమ్మాయి లవ్‌ చేసి వెళ్లిపోయింది కదా దాని గురించి ఎందుకు మాట్లాడవు అంటూ కౌంటర్ ఇచ్చారు. “నన్ను రోడ్డు మీదకు లాగారు కాబట్టి.. నేను రోడ్డుమీదకు వచ్చాను.. మీ గురించి, మీ అన్నయ్య గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు” అని తెలిపారు!

ఇదే క్రమంలో... ప్రచార సభల్లో "ముద్రగడ జోహర్‌" అంటూ తన అభిమానులతో అనిపించడం ఎంత వరకు సమంజసం అని ముద్రగడ ప్రశ్నించారు. గతంలో కూడా ముద్రగడ కుమారుడు మరణించాడని, ముద్రగడ భార్య మరణించిందని తప్పుడు ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు!! సినిమాల్లో నటించు కానీ... రాజకీయాల్లో నటించొద్దంటూ పవన్ కు సూచించారు.