Begin typing your search above and press return to search.

అదరకొట్టేసిన రిలయన్స్.. రూ.10 లక్షల మార్కు టర్నోవర్ దాటేశారు

మాంచి జోరు మీద ఉన్న నేపథ్యంలో రిలయన్స్ వార్షిక టర్నోవర్ రూ.10 లక్షల కోట్ల రికార్డు మార్కును దాటేయటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   23 April 2024 5:30 AM GMT
అదరకొట్టేసిన రిలయన్స్.. రూ.10 లక్షల మార్కు టర్నోవర్ దాటేశారు
X

రికార్డుల మీద రికార్డుల్ని క్రియేట్ చేస్తూ.. తనకు తిరుగే లేదన్నట్లుగా దూసుకెళ్లే రిలయన్స్ సంస్థ మరో కీలక రికార్డును సొంతం చేసుకుంది. మన దేశంలో మరే కంపెనీ సాధించలేని రికార్డును రిలయన్స్ సొంతం చేసుకుంది. తమ పరిధిలోని కంపెనీల వ్యాపారాలన్నీరాణించటంతో .. మాంచి జోరు మీద ఉన్న నేపథ్యంలో రిలయన్స్ వార్షిక టర్నోవర్ రూ.10 లక్షల కోట్ల రికార్డు మార్కును దాటేయటం ఆసక్తికరంగా మారింది. ఈ ఘనతను సాధించిన భారత దేశ తొలి కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

తాను సాధించిన ఘనత గురించి సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ స్పందిస్తూ.. ‘‘రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్ల మార్కును దాటేసింది. అన్ని విభాగాలు రాణించాయి. పలు మైలురాళ్లను కంపెనీ సాధించింది. పన్నుకు ముందు లాభాల విషయంలో రూ.లక్ష కోట్లను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచిందని చెప్పటానికి సంతోషిస్తున్నా. డిజిటల్ రిటైల్ విభాగాల్లో మంచి జోరు కనిపిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముడిచమురు.. పెట్రో రసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించటంతో పాటు టెలికాం.. రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగింది.

దీంతో భారీ టర్నోవర్ కు కారణమైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టర్నోవర్ అయితే వచ్చింది కానీ లాభాలు మాత్రం తగ్గాయి. మరింత వివరంగా చెప్పాలంటే.. సంస్థకు చెందిన అన్నీ వ్యాపారాలు అదరగొట్టేశాయి. అలాంటప్పడు ఆటోమేటిక్ గా లాభాలు కూడా అంతే రావాలి. కానీ.. అలాంటి పరిస్థితి లేని పరిస్థితి. ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ టర్నోవర్ రూ.9.74 లక్షల కోట్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.6 శాతం పెరుగుదలతో రూ.10 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇంతటి భారీ టర్నోవర్ సాధించిన మొదటి సంస్థగా రిలయన్స్ నిలిచింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.66,702 కోట్లు కాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.69,621 కోట్లుగా నమోదైంది. అయితే.. చివరి త్రైమాసికంలో లాభం తగ్గిన పరిస్థితి. దీంతో మొత్తంగా చూస్తే.. స్వల్ప లాభాన్ని మాత్రమే సొంతమైంది.

రిలయన్స్ సంస్థలో కీలకంగా మారిన జియో విషయానికి వస్తే 2023 డిసెంబరు నాటికి వినియోగదారుల సంఖ్య 47.09 కోట్లు ఉండగా.. 2024 మార్చి చివరకు 48.18కోట్లుగా చేరటం గమనార్హం. డేటా రద్దీ 40.9 బిలియన్ జీబీలుగా నమోదైంది. పూర్థి ఆర్థిక సంవత్సరంలో జియో రూ.21,424కోట్ల లాభాన్ని ఆర్జిస్తే.. 2022-23లో ఇది కూ.19,124 కోట్లుగా ఉంది. దేశ వ్యాప్తంగా జియో 5జీ వినియోగదారుల సంఖ్య 10.8 కోట్లుగా నమోదైంది. చైనా తర్వాత అతి పెద్ద ఆపరేటర్ గా జియో నిలిచింది.

రిలయన్స్ లోని కీలక వ్యాపారాల లాభాలు దగ్గర దగ్గర 11 శాతం వరకు ఉన్నాయి. రిటైల్ వ్యాపారంలో రిలయన్స లాభంఅంతకు ముందు లాభంతో పోలిస్తే 11.7 శాతానికి పెరిగింది. కొత్తగా 562 స్టోర్లు జత కావటంతో మొత్తంగా 18,836స్టోర్లు ఉన్నాయి. 2023-24లో రిటైల్ వ్యాపార స్థూల ఆదాయం రూ.3 లక్షల కోట్లను అధిగమించటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టర్నోవర్.. ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు చేసిన రిలయన్స్ ను 2023-24 ఆర్థిక సంవత్సరంలో అప్పులు కూడా పెరిగాయి. 2023 డిసెంబరు నాటికి కంపెనీకి రూ.3.11 లక్షల కోట్లు అప్పులు ఉండగా.. 2024మార్చికి అవి కాస్తా రూ.3.24 లక్షల కోట్లకు పెరిగాయి. నికర రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.16 లక్షల కోట్లకు తగ్గినట్లుగా కంపెనీ చెబుతోంది.