Begin typing your search above and press return to search.

ఈ 25 షేర్లను కొన్న రోజునే ఖాతాలోకి బదిలీ

గడిచిన కొంతకాలంగా మాట్లాడుకుంటున్న సరికొత్త విధానం స్టాక్ మార్కెట్ లో అమల్లోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   28 March 2024 7:30 AM GMT
ఈ 25 షేర్లను కొన్న రోజునే ఖాతాలోకి బదిలీ
X

గడిచిన కొంతకాలంగా మాట్లాడుకుంటున్న సరికొత్త విధానం స్టాక్ మార్కెట్ లో అమల్లోకి వచ్చింది. ఇంతకాలం స్టాక్ మార్కెట్ లో నమోదయ్యే కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన తర్వాత.. వాటిని కొనుగోలుదారు ఖాతాలోకి జమ కావటానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకోవటం తెలిసిందే. తాజాగా మాత్రం టీ+0 విధానంలో కొన్న రోజునే ఖాతాలోకి బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పాతిక షేర్లను ఎంపిక చేశారు.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తున్న ఈ విధానం సక్సెస్ అయితే.. దశల వారీగా మరికొన్ని షేర్లను ఇదే తరహాలో సెటిల్ చేస్తారు. టీ+0 అంటే.. కొన్న రోజునే ఖాతాలో సెటిల్ మెంట్ గా చెప్పాలి. దీని కారణంగా మార్కెట్ కార్యకలాపాల వ్యయాలు.. సమయం ఆదా కానున్నాయి. మదుపర్ల నుంచి వసూలుచేసే రుసుముల్లో పారదర్శకతతో పాటు క్లియరింగ్ కార్పొరేషన్లలో నష్ట నియంత్ర వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఈ విధానం మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఈ రోజు (గురువారం, మార్చి 28) నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో టీ+0 విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. తొలుత ఈ విధానంలోకి తెస్తున్న పాతిక కంపెనీలు ఏమిటంటే..

1. బజాజ్ ఆటో

2. వేదాంతా

3. హిందాల్కో ఇండస్ట్రీస్

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

5. ట్రెంట్

6. టాటా కమ్యూనికేషన్స్

7. నెస్లే ఇండియా

8. సిప్లా

9. ఎంఆర్ఎఫ్

10. జేఎస్ డబ్ల్యూ స్లీల్

11. బీపీసీఎల్

12. ఒఎన్ జీసీ

13. అంబుజా సిమెంట్స్

14. అశోక్ లేలాండ్

15. బ్యాంక్ ఆఫ్ బరోడా

16. బిర్లా సాఫ్ట్

17. కోఫోర్జ్

18. దివీస్ లేబొరేటరీస్

19. ఇండియన్ హోటల్స్

20. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్

21. ఎల్ టీఐ మైండ్ ట్రీ

22. యూనియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

23. ఎన్ఎండీసీ

24. సంవర్థన మదర్ సన్ ఇంటర్నేషనల్

25. పెట్రోనెట్ ఎల్ ఎన్ జీ

ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా షురూ చేస్తున్నారు. ఎంపిక చేసిన బ్రోకర్ల పరిధిలోని మదుపర్లతో పాటు అందరూ వినియోగించుకోవచ్చు. ఉదయం 9.15 గంటల నుంచి మధ్యామ్నం 1.30 గంటల వరకు ట్రేడింగ్ కు దీనికి అమలు చేయనున్నారు. అయితే.. సూచీని గణించటంలో టీ+0 కింద సెటిల్ అయిన షేర్ల విలువను లెక్కలోకి తీసుకోరు. ఈ రోజు నుంచి పాతిక షేర్లు టీ+0 విధానంలో.. మిగిలిన షేర్లు టీ+1 విధానంలో సెటిల్ చేయనున్నారు.