Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటి అడక్కు టార్గెట్.. ఎంత వస్తే హిట్టు?

ఇదిలా ఉంటే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4.5 కోట్ల ఫ్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 May 2024 3:59 AM GMT
ఆ ఒక్కటి అడక్కు టార్గెట్.. ఎంత వస్తే హిట్టు?
X

కామెడీ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు అల్లరి నరేష్. అల్లరి చిత్రంతో కెరియర్ స్టార్ట్ చేసిన నరేష్ సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి కామెడీ చిత్రాలతో నరేష్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదు. దీంతో రూట్ మార్చి కాస్త సీరియస్ సబ్జెక్టులతో మూవీస్ చేశారు. వీటిలో నాంది మూవీ నరేష్ కి సూపర్ హిట్ ఇచ్చింది.

అలాగే ఇతర హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలలో నరేష్ నటించారు. అలా మహర్షి సినిమా నరేష్ కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో కింగ్ నాగార్జునతో చేసిన నా సామీ రంగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మరల కామెడీ కథతో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేశారు.

మే 3న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. పెళ్లి కోసం తాపత్రయ పడే యువకుడి లైఫ్ పాయింట్ గా ఈ మూవీ కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ పై పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4.5 కోట్ల ఫ్రీ రిలీజ్ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది తక్కువ టార్గెట్ అని చెప్పొచ్చు. సోలోగా సరైన సక్సెస్ లు లేకపోవడంతో నరేష్ మార్కెట్ డ్రాప్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వీకెండ్ మూడు రోజుల్లోనే వచ్చేస్తాయని మాట వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది.

చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి కూడా రేస్ లో లేవు. ఈ నేపథ్యంలో కావలసినంత స్పేస్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉన్న కథలనే ఇష్టపడుతున్నారు. ఆ ఒక్కటి అడక్కు మూవీ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించి హిట్ బొమ్మగా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. అల్లరి నరేష్ కూడా కెరియర్ పరంగా ఒక సాలిడ్ సక్సెస్ ని ఈ మూవీతో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.