Begin typing your search above and press return to search.

వీడియో : బికినీలో జల కన్యను చూశారా?

నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ త్రిధా చౌదరి

By:  Tupaki Desk   |   26 March 2024 8:10 AM GMT
వీడియో : బికినీలో జల కన్యను చూశారా?
X

నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ త్రిధా చౌదరి. ఈ అమ్మడు ఆ తర్వాత మనసుకు నచ్చింది సినిమాలో కూడా నటించింది. అయితే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

సినిమాల్లో స్టార్‌ డమ్ దక్కించుకోలేక పోయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల వీడియోను షేర్‌ చేసి చూపు తిప్పుకోనివ్వడం లేదు.

జల కన్య మాదిరిగా అందాల త్రిధ చౌదరి సోషల్ మీడియాలో ఈవీడియోను షేర్ చేసింది. బికినీలో జలకాలాడుతూ ఉన్న త్రిధ వీడియోను నెటిజన్స్ అలా చూస్తూనే ఉండి పోతున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యి మరోసారి త్రిధ గురించిన చర్చ జరుగుతోంది.

అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేయడం ద్వారా మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరిపింది. త్వరలోనే ఏదో ఒక సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.