Begin typing your search above and press return to search.

ఏషియ‌న్ నారంగ్ వార‌సురాలి ఫస్ట్ మూవీ.. ప్రియదర్శి హీరోగా..

ఈ మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ప్రియదర్శి హిలేరియస్ రోల్ లో కనిపించనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో 'థ్రిల్ యూ ప్రాప్తిరస్తు' అనే క్యాచీ ట్యాగ్ లైన్ ను ఇచ్చారు మేకర్స్.

By:  Tupaki Desk   |   28 April 2024 8:15 AM GMT
ఏషియ‌న్ నారంగ్ వార‌సురాలి ఫస్ట్ మూవీ.. ప్రియదర్శి హీరోగా..
X

ఝాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. రీసెంట్ గా ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. అతి చిన్న వయస్సులోనే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఝాన్వీ.. ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు.

చెప్పాలంటే ఏషియ‌న్ సినిమాస్ అనేక ఆవిష్కరణల్లో ఝాన్వీదే కీరోల్. తమ మల్టీప్లెక్స్ చైన్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడమే కాకుండా, ప్రొడక్షన్ లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. తమ సంస్థ మంచి లాభాలు అందుకునేందుకు కృషి చేస్తున్నారు. ఎంట‌ర్ప్రెన్యూర్ గా రాణిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఝాన్వీ.. ఇప్పుడు నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.

అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లేటెస్ట్ గా వచ్చింది. బలగంతో పెద్ద విజయాన్ని అందుకుని, ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. నవనీత్ శ్రీరామ్ ఈ మూవీతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP), హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా సమర్పించనున్నాయి.

ఈ మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ప్రియదర్శి హిలేరియస్ రోల్ లో కనిపించనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో 'థ్రిల్ యూ ప్రాప్తిరస్తు' అనే క్యాచీ ట్యాగ్ లైన్ ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతినివ్వనుందో ట్యాగ్ లైన్ ఈజీగా చెప్పేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు మేకర్స్.

2025 జనవరిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లనుంది. క్యాస్టింగ్ తో పాటు సినిమా టైటిల్ ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్ గైడెన్స్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు ఝాన్వీ నారంగ్. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఇప్పుడు తొలి ప్రయత్నం చేస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం విశేషం. మరి ఝాన్వీ డెబ్యూ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.