Begin typing your search above and press return to search.

GOG ఆయేషా ఖాన్.. కుర్రాళ్ల కొత్త క్రష్!

తన నవ్వుతోనే అందరినీ మాయ చేస్తూ టాలీవుడ్ నయా గ్లామర్ డాల్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   23 March 2024 12:11 PM GMT
GOG ఆయేషా ఖాన్.. కుర్రాళ్ల కొత్త క్రష్!
X

ఆయేషా ఖాన్.. ఇప్పుడు టాలీవుడ్ తోపాటు నెట్టింట ఈ పేరు ఫుల్ ట్రెండ్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ముంబై బ్యూటీ ఫొటోలు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది. రీల్స్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో చాలా మందికి క్రష్ లిస్ట్ లోకి చేరిపోయింది. తన నవ్వుతోనే అందరినీ మాయ చేస్తూ టాలీవుడ్ నయా గ్లామర్ డాల్ గా మారిపోయింది.


బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్.. రెండేళ్ల క్రితం టాలీవుడ్ కు పరిచయమైంది. 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముఖచిత్రం సినిమాలో యాక్ట్ చేసింది. ఆ మూవీలో కనిపించింది కాసేపే అయినా.. తన గ్లామర్ తో ఫిదా చేసింది. ఇక ఈ చిత్రంలో బైక్ యాక్సిడెంట్ సీన్ కోసం రిస్క్ చేసి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత మెల్లగా కోలుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు ఈ బ్యూటీకి.

ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్-17 లో పాల్గొంది. హౌస్ లోకి వెళ్లిన కొద్ది రోజులకే ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ చేసింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగినా.. దక్కించుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ కన్నా ముందు ఆమెకు ఓం భీమ్ బుష్ మూవీ ఛాన్స్ వచ్చింది. నిన్ననే ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. కమెడియన్ ప్రియదర్శికి జోడీగా నటించింది. తన గ్లామర్ షోతో కుర్రాళ్ల మనసు గెలుచుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా మారిన ఈ అమ్మడు.. త్వరలోనే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో సందడి చేయనుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు విశ్వక్ తో ఆడిపాడింది. ఈ సాంగ్ పోస్టర్ నిన్ననే రిలీజ్ చేసిన మేకర్స్.. పాటను హోలీ స్పెషల్ గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ లో వైట్ శారీలో ఉన్న అయేష.. అప్సరసలా మతిపోగుడుతోంది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీలో అమ్మడు దూసుకుపోవడం పక్కా!

ఇక వెంకీ అట్లూరి- దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది అయేషా ఖాన్. దీంతోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఓ సినిమాలో ఆఫర్ కొట్టేసిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తుంటే.. ఆయేష జోరు మామూలుగా లేదని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ లో ఆయేషా ఖాన్.. ఇదే ఊపును కొనసాగించి మరిన్ని పాత్రలు దక్కించుకుంటుందో లేదో చూడాలి.