Begin typing your search above and press return to search.

అక్షయ్, ష్రాఫ్‌ జోడి.. హై యాక్షన్ డోస్

ఇక ఈ సినిమా టీజర్ లాగానే.. ట్రైలర్ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగ్స్ తో మొదలైంది.

By:  Tupaki Desk   |   26 March 2024 2:48 PM GMT
అక్షయ్, ష్రాఫ్‌ జోడి.. హై యాక్షన్ డోస్
X

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా బడే మియా చోటే మియా. భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను పూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుండగా.. మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో బడే మియా చోటే మియా పేరుతో అమితాబ్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ యాక్షన్ మూవీ కచ్చితంగా చూడాలన్నంత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. వేసవి కానుకగా ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు మరోసారి తెలిపారు.

ఇక ఈ సినిమా టీజర్ లాగానే.. ట్రైలర్ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ డైలాగ్స్ తో మొదలైంది. టీజర్ లో ఓన్లీ వాయిస్ వినిపించగా.. ఇక్కడ పృథ్వీరాజ్ ఫేస్ కనపడకుండా మాస్క్ తో కనిపించారు. భారత్ కు చెందిన మోస్ట్ పవర్ఫుల్ ఆయుధాన్ని పృథ్వీరాజ్ దొంగిలిస్తారు. అతడిని మట్టుబెట్టే ఆపరేషన్ ను అక్షయ్, టైగర్ ష్రాఫ్ మిషన్ కు అప్పగిస్తారు. మరి ఆ శత్రువును ఇద్దరు ఏజెంట్లు ఎలా అంతం చేస్తారనేది ఈ సినిమా కథగా ట్రైలర్ లో చూపించారు.

అయితే ఇద్దరు హీరోలతో పాటు హీరోయిన్స్ మానుషీ చిల్లర్, ఆలయ ఫార్ట్యూన్ వాలా కూడా ఆ శత్రువును మట్టుబెట్టే మిషన్ లో పాల్గొంటారు. ఈ మొత్తం టీమ్ అంతా కలిసి విలన్ పృథ్వీరాజ్ ను ఎలా ఎదుర్కొన్నారనేదే మిగతా కథ. మొత్తం ట్రైలర్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్‌ తో నింపేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ సినిమాకు సుల్తాన్, టైగర్ జిందా హై వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. వశు భగ్నానీ, దీప్షికా దేశముఖ్, జాకీ భగ్నానీ నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం పక్కా అని చెప్పవచ్చు. మరి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో చూడాలి.