Begin typing your search above and press return to search.

వెంకటేష్ వెడ్స్ బర్రెలక్క... నెట్టింట శుభాకాంక్షల సందడి!

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధినేతలు, కీలక నేతలతో పాటు ఒక పేరు బలంగా వినిపించింది

By:  Tupaki Desk   |   29 March 2024 5:18 AM GMT
వెంకటేష్ వెడ్స్ బర్రెలక్క... నెట్టింట శుభాకాంక్షల సందడి!
X

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధినేతలు, కీలక నేతలతో పాటు ఒక పేరు బలంగా వినిపించింది. ఆమె... కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోయింది! అప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆమె... నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజాగా బర్రెలక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

అవును... 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారిలో సైతం చర్చనీయాంశమైన బర్రెలక్కీ... మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గతంలో ప్రకటించినందుకు కాదు సుమా... వివాహ బంధంలోకి అడుగుపెట్టినందుకు. ఈ నేపథ్యంలో... తన సమీప బంధువు వెంకటేశ్ తో బర్రెలక్క ఏడడుగులు వేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో బర్రెలక్క వెడ్స్ వెంకటేష్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది! ఈ వేడుకకు బంతుమిత్రులతొ పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతక ముందే తన వివాహంపై బర్రెలక్క సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంది.

ఇందులో భాగంగా తన ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో.. ఈ ఫోటోలు వైరల్ గా మారుతుండగా.. ఆమెకు భారీ ఎత్తున శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

కాగా... డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని.. అందుకే తన తల్లి ఇచ్చిన బర్రెలు కస్తూ బ్రతుకుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా శిరీష పెట్టిన వీడియోలు ఫుల్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో.. శిరీష పేరు కాస్తా బర్రెలక్కగా మారిపోయింది. ఈ క్రమంలో నెట్టింట ఈ పేరు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగ సమస్యలపై రకరకాల పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచారు.

ఈ క్రమంలో... గత ఏడాది జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క.. అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువతతో పాటు పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.