Begin typing your search above and press return to search.

NBK109 సెట్స్‌ లో వైల్డ్‌ యానిమల్‌

ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న యానిమల్‌ ఫేం బాబీ డియోల్‌ కాంబో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   24 April 2024 6:14 AM GMT
NBK109 సెట్స్‌ లో వైల్డ్‌ యానిమల్‌
X

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NBK109 సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా బాలకృష్ణ షూటింగ్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయినా కూడా షూట్‌ ని మాత్రం బాబీ ఆపడం లేదు.

ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న యానిమల్‌ ఫేం బాబీ డియోల్‌ కాంబో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. మొదటి సారి తెలుగు సినిమాలో నటిస్తున్న బాబీ డియోల్‌ చాలా ఎగ్జైట్‌ గా ఉన్నట్లుగా తాజా చిట్‌ చాట్‌ లో పేర్కొన్నాడు.

హీరోగా ఎన్నో సూపర్‌ హిట్స్ దక్కించుకున్న బాబీ డియోల్‌ ఇప్పుడు బాలయ్య, బాబీ సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్నాడు. యానిమల్‌ సినిమాలో బాబీ డియోల్‌ పాత్ర వైల్డ్‌ యానిమల్‌ ను తలపించింది. సౌత్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విలన్ అంటూ యానిమల్‌ ని చూస్తే అర్థం అవుతుంది.

బాలయ్య కు సరి పోటీ గా బాబీ డియోల్‌ నిలవడం ఖాయం. వీరిద్దరి కాంబో వెండి తెరపై మెరుపులు మెరిపిస్తుందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. డబుల్‌ రోల్‌ లో బాలయ్య కనిపించబోతున్నాడని, ఒక హీరోయిన్ గా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం కోసం బాలీవుడ్‌ తారాగణం ను పెద్ద ఎత్తున ఈ సినిమాలో బాబీ నటింపజేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య డబుల్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు.