Begin typing your search above and press return to search.

దుల్కర్‌ తెలుగు ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌

ముఖ్యంగా లేడీస్ పాలోయింగ్‌ ను ఎక్కువగా దక్కించుకున్న దుల్కర్‌ సల్మాన్‌ వరుసగా మలయాళ మరియు హిందీ సినిమాలను చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   29 April 2024 12:03 PM GMT
దుల్కర్‌ తెలుగు ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌
X

మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా లేడీస్ పాలోయింగ్‌ ను ఎక్కువగా దక్కించుకున్న దుల్కర్‌ సల్మాన్‌ వరుసగా మలయాళ మరియు హిందీ సినిమాలను చేస్తున్నాడు.

కమల్‌ హాసన్‌ తో కలిసి థగ్‌ లైఫ్‌ సినిమాలో కూడా దుల్కర్ నటిస్తున్నాడు అనే సమాచారం ఉంది. ఆ విషయాలు పక్కన పెడితే దుల్కర్ తదుపరి తెలుగు సినిమా ఖరారు అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

దుల్కర్ సల్మాన్‌ హీరోగా సుధాకర్‌ చెరుకూరి నిర్మాణంలో రూపొందబోతున్న సినిమాకు రవికాంత్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే కథ కు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. అతి త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట.

దసరా సినిమాతో నిర్మాతగా మంచి పేరును దక్కించుకున్న సుధాకర్‌ చెరుకూరి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలే కాకుండా కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ అభిరుచి గల నిర్మాత అనిపించుకుంటున్నాడు.

ఇప్పటికే సుధాకర్‌ చెరుకూరి బ్యానర్‌ లో రెండు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది మూడో సినిమా అవ్వబోతుంది. దుల్కర్‌ సల్మాన్‌ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ తో కొత్త దర్శకుడితో సుధాకర్‌ చెరుకూరి చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

దుల్కర్ సల్మాన్‌ సినిమాల విషయంలో చాలా జోరు మీదున్నాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇతర భాషల స్టార్‌ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయడానికి కష్టపడుతూ ఉంటే దుల్కర్‌ మాత్రం ఆ రేసులో చాలా ముందు ఉన్నాడు. దుల్కర్‌ ఏ భాష లో నటించినా పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాలు విడుదల అవుతున్నాయి.