Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఎంత?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్.

By:  Tupaki Desk   |   25 March 2024 3:56 AM GMT
ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఎంత?
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కి ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని పరశురామ్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి.

గత ఏడాది ఖుషి మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. చివరిగా విజయ్ కి సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే టాక్సీ వాలా. దాని తర్వాత నాలుగు డిజాస్టర్స్ వచ్చాయి. ముఖ్యంగా భారీ హైప్ తో వచ్చిన లైగర్ గట్టి దెబ్బె కొట్టింది.

అనంతరం వెంటనే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి మూవీతో కొంత వరకు లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీతో సూపర్ హిట్ వస్తుందనే కాన్ఫిడెంట్ తో విజయ్ దేవరకొండ ఉన్నాడు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పాటు టీజర్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మూవీ మీద సాలిడ్ గా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

థీయాట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్లకి అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ మీద ఈ స్థాయిలో బిజినెస్ అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. వరుస సక్సెస్ ల మీద ఉన్న నాని సినిమాలకి కూడా ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం లేదు. అయితే పరశురామ్, విజయ్ కాంబోలో ఇది వరకు గీతాగోవిందం వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

ఆ మ్యాజిక్ ఫ్యామిలీ స్టార్ కి వర్క్ అవుట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా గట్టిగానే ఖర్చు చేస్తినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రచార వ్యయంతో కలుపుకొని 55 కోట్ల వరకు లెక్కలు తేలనున్నట్ల సమాచారం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియోస్ ఫ్యాన్సీ ధరకి దక్కించుకున్నాయి.

ఓవరాల్ గా మూవీని దిల్ రాజు ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గానే థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఈ మూవీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండకి జోడీగా నటించింది. ఆమె ఇమేజ్ కూడా అదనంగా ఈ మూవీ బిజినెస్ కి కలిసొచ్చిందని టాక్. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.