Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మధ్యకి వచ్చేది అప్పుడే..!

ఈ సినిమా తో విజయ్ మరో కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనుకుంటే ఆయన ఫ్యాన్స్‌ కి నిరాశే మిగిలింది.

By:  Tupaki Desk   |   24 April 2024 11:48 AM GMT
ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మధ్యకి వచ్చేది అప్పుడే..!
X

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ఈ సినిమా తో విజయ్ మరో కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనుకుంటే ఆయన ఫ్యాన్స్‌ కి నిరాశే మిగిలింది.

ఫ్యామిలీ స్టార్‌ సినిమా టాక్‌ తో సంబంధం లేకుండా మొదటి రెండు మూడు రోజులు కాస్త పర్వాలేదు అన్నట్లుగా కలెక్షన్స్ వచ్చాయి అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌. ఆ విషయం పక్కన పెడితే ఫ్యామిలీ స్టార్‌ కి క్రియేట్‌ అయిన బజ్ నేపథ్యంలో ఎప్పుడు ఓటీటీ లో వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్‌ ను ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే రోజు రాబోతుంది. ఏప్రిల్‌ 26న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ లో ఫ్యామిలీ స్టార్‌ సినిమాను ప్రేక్షకులు చూడవచ్చు. థియేట్రికల్‌ రన్ లో నిరాశ పరిచిన ఫ్యామిలీ స్టార్ కి ఓటీటీ లో మంచి స్పందన దక్కే అవకాశం ఉంది.

విజయ్‌ దేవరకొండ గత చిత్రం ఖుషి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్‌ పై మొదటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యింది.