Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు హరోం హర.. ఆ స్పెషల్ డే రోజే..

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 April 2024 12:54 PM GMT
సుధీర్ బాబు హరోం హర.. ఆ స్పెషల్ డే రోజే..
X

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. ప్రస్తుతం హరోం హర సినిమా చేస్తున్నారు. రూరల్ గ్యాంగ్ స్టర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సెహరి' ఫేం జ్ఞానసాగర్‌ ద్వారకా కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ అండ్ టైటిల్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కనులెందుకో అంటూ సాగే ఈ మెలోడీ పాటను హీరోహీరోయిన్లపై అందంగా చిత్రీకరించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను శనివారం సాయంత్రం అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇండియా ఫస్ట్ సూపర్ స్టార్, దివంగత నటుడు కృష్ణ జయంతి అయిన మే 31వ తేదీన హరోం హర మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే సుధీర్ నటించిన కొన్ని సినిమాలకు సంబంధించిన కంటెంట్ అదే రోజు రివీల్ అయింది. అయితే మే 31.. హరోం హర విడుదలకు సరైన డేట్ అని చెప్పవచ్చు. అప్పటికి ఇంకా విద్యార్థులకు సెలవులు ఉంటాయి. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు.. మూవీకి మంచి వసూళ్లు వస్తాయి.

ఇక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను షేర్ చేస్తూ మేకర్స్.. 'సుబ్రహ్మణ్యుడి సంభవానికి ముహూర్తం సిద్ధం అయ్యిండాది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లో సుధీర్ బాబు చేతిలో సుబ్రహ్మణ్య స్వామి ఆయుధంతో నిలబడి క్రూరంగా కనిపిస్తున్నారు. వెనుక అనేక మంది వ్యక్తులు.. గౌరవసూచకంగా చేతులు ఊపుతున్నారు. కొత్త పోస్టర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.