Begin typing your search above and press return to search.

హరోమ్ హర… కనులెందుకో కలిసేనులే కలలా..

ఆ సినిమా విడుదలకు టైమ్ దగ్గర పడుతుండడంతో వరుస అప్డేట్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 11:11 AM GMT
హరోమ్ హర… కనులెందుకో కలిసేనులే కలలా..
X

ఘట్టమనేని అల్లుడుగారు సుధీర్ బాబు సక్సెస్ ఫెయిలర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో నటనకు మంచి స్కోప్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు అతని నుంచి మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా విడుదలకు టైమ్ దగ్గర పడుతుండడంతో వరుస అప్డేట్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.


సుదీర్ బాబు, మాళవిక శర్మ జోడీగా గంగాధర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా హరోమ్ హర. పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ కథతో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుధీర్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాయి.

తాజాగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. కనులెందుకో కలిసేనులే కలలా ఇలా.. అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ లో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ప్రయాణాన్ని ఆవిష్కరించారు. సాంగ్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. వేంగి సుధాకర్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు. నిఖిత శ్రీవల్లి ఆలపించింది. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ సమకూర్చారు.

ఫీమేల్ పాయింట్ అఫ్ వ్యూలో మాళవిక శర్మ, సుధీర్ బాబు పైన సాంగ్ ని డిజైన్ చేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడవబోతోందని తెలుస్తోంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో జరిగిన కథగా హరోంహర సినిమాని చూపించబోతున్నారు. సుధీర్ బాబు ఈ చిత్రంలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య సంభాషణలు అచ్చమైన రాయలసీమ స్లాంగ్ లో ఉండటం విశేషం.

సినిమా టీజర్, సాంగ్స్ తో ఇప్పటికే మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా సుధీర్ బాబు కెరియర్ లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రవితేజ గిరజాల ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఫ్యాక్షన్ గొడవలని, గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుని దర్శకుడు విజువల్ గా ప్రెజెంట్ చేశారు. సుధీర్ బాబు పాత్రకి కూడా ఫుల్ మాస్ అప్పీల్ ఉంది. అన్ని భాషలకి చెందిన స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. కచ్చితంగా సుధీర్ బాబు కెరియర్ లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సుధీర్ బాబు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.