Begin typing your search above and press return to search.

AI మ్యాజిక్: హాలీవుడ్ తార‌ల రంగుల పండ‌గ‌

అదంతా స‌రే కానీ.. ఇవే ఆట‌లు పాశ్చాత్య న‌టులు, స్టార్ క‌పుల్స్ కూడా ఆడితే ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   23 March 2024 3:28 PM GMT
AI మ్యాజిక్: హాలీవుడ్ తార‌ల రంగుల పండ‌గ‌
X

రంగులతో హోలీ ఆడ‌టంలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఘ‌నాపాటీలు. ప్ర‌తియేటా హోలీ సంబ‌రంలో మునిగి తేల్తున్న బాలీవుడ్ క‌పుల్స్ , ఇత‌ర సెల‌బ్రిటీల ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా షేర్ అవుతుంటాయి. బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్- క‌త్రిన‌, ఆలియా- ర‌ణ‌బీర్, కియ‌రా- సిద్ధార్థ్ మ‌ల్మోత్రా లాంటి యువ జంట‌లు హోలీ ఆట‌లో విసుగెత్తేంత‌గా ఆడి అల‌సిపోయిన ఫోటోలు వెబ్ లో ఉన్నాయి.


అదంతా స‌రే కానీ.. ఇవే ఆట‌లు పాశ్చాత్య న‌టులు, స్టార్ క‌పుల్స్ కూడా ఆడితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ అంద‌మైన ఫోటోలా ఉంటుంది. దీనిని ఏఐలో రూపొందించారు. చాలా అందంగా మ‌నోహ‌రంగా చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. హాలీవుడ్ తారలు హోలీ రోజు రంగులతో ఆడుతున్నప్పుడు ఎలా కనిపిస్తారు? AI భారతదేశంలో వారి #రంగ్ బ‌ర్సే క్షణాలను విజువ‌లైజ్ చేస్తే ఇలా ఉంటుంది! అంటూ ఈ ఫోటోని షేర్ చేయ‌గా అది వెబ్ లో దూసుకెళుతోంది.


ఇందులో పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్ల ముఖాలు ఉన్నాయి. టేల‌ర్ స్విఫ్ట్, సెలీనా గోమేజ్, జెన్నిఫ‌ర్ ఆనిస్ట‌న్, టామ్ క్రూజ్, టామ్ హోలాండ్, మార్గ‌ట్రోబీ, జ‌స్టిన్ బీబర్, జెండ‌యా, లియోనార్డో డికా ప్రియో వంటి టాప్ స్టార్లు రంగుల‌ హోలీ ఆడితే ఇదిగో ఇలా ఉంటారు! అంటూ ఇమాజినేటెడ్ గా ఏఐలో రూపొందించిన ఆర్ట్ ఇది. హోలీ, హ్యాపీ హోలీ, AI, AI ఆర్ట్, హాలీవుడ్ అంటూ ర‌క‌ర‌కాల ట్యాగుల‌తో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోల‌ను వీక్షించాక ఏఐ మ్యాజిక్ అద్భుతంగా వ‌ర్కవుటైందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.