Begin typing your search above and press return to search.

మొన్న కూతురు కోసం, ఇప్పుడు తనకోసం..!

కూతురు కోసం ఇనిమేల్ కు సాహిత్యంను అందించిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు తన సినిమా థగ్‌ లైఫ్ లోని ఒక పాట కోసం సాహిత్యం అందించాడు.

By:  Tupaki Desk   |   28 April 2024 5:20 AM GMT
మొన్న కూతురు కోసం, ఇప్పుడు తనకోసం..!
X

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ మల్టీ టాలెంటెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ ప్లే రైటర్ గా ఇలా ఎన్నో విభాగాల్లో కమల్‌ హాసన్ కి ప్రావిణ్యం ఉంది. అంతే కాకుండా పాటలకు సాహిత్యంను అందించడంలో కూడా కమల్‌ కి అనుభవం ఉంది.

ఇటీవల తన కూతురు శృతి హాసన్‌ రూపొందించిన ఇనిమేల్‌ అనే మ్యూజిక్ ఆల్బం కోసం కమల్‌ హాసన్‌ సాహిత్యంను అందించాడు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటించిన ఆ మ్యూజికల్‌ వీడియో కి మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.

కూతురు కోసం ఇనిమేల్ కు సాహిత్యంను అందించిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు తన సినిమా థగ్‌ లైఫ్ లోని ఒక పాట కోసం సాహిత్యం అందించాడు. మణిరత్నం కోరడంతో కేవలం రెండు గంటల్లోనే కమల్‌ హాసన్ పాటను రాయడంతో పాటు రికార్డింగ్ కూడా చేయడం జరిగిందట.

విక్రమ్‌ సినిమా తర్వాత ఫుల్‌ జోష్ మీద ఉన్న కమల్‌ హాసన్‌ వరుస సినిమాలు చేస్తున్నాడు. మూడు దశాబ్దాల తర్వాత మణిరత్నం తో కలిసి కమల్‌ హాసన్ సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

త్రిష హీరోయిన్ గా నటిస్తున్న థగ్‌ లైఫ్ సినిమాలో పలువురు యంగ్‌ స్టార్స్ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియాలో రెగ్యులర్‌ గా థగ్‌ లైఫ్ గురించిన వార్తలు వస్తూ ఉండటంతో సినిమా పై అంచనాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి.

ఆర్‌ మహేంద్రన్‌, శివ అనంతిలతో కలిసి కమల్‌ మరియు మణిరత్నంలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. తమిళ స్టార్‌ హీరో శింబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని, త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ఉదయనిధి స్టాలిన్ సమర్పించబోతున్నాడు.