Begin typing your search above and press return to search.

రేపు రావాల్సిన సినిమా నెల వెనక్కి

ఈ వారం విడుదల కావాల్సిన లవ్ మి, ప్రతినిధి-2 కూడా వెనక్కి వెళ్లాయి. 'ప్రతినిధి-2'కు సెన్సార్ సమస్యలు ఉండడంతో రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు.

By:  Tupaki Desk   |   24 April 2024 10:07 AM GMT
రేపు రావాల్సిన సినిమా నెల వెనక్కి
X

సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్ అనుకున్న వేసవి.. ఈసారి వెలవెలబోతోంది. సరైన సినిమాలు లేకపోవడం, ఐపీఎల్ హడావుడి, ఎన్నికల హంగామా.. అన్నీ కలిసి బాక్సాఫీస్ వెలవెలబోయేలా చేస్తున్నాయి. దీంతో ఆల్రెడీ షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటున్నాయి. గత వారం రావాల్సిన 'శశివదనే' సహా కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి.

ఈ వారం విడుదల కావాల్సిన లవ్ మి, ప్రతినిధి-2 కూడా వెనక్కి వెళ్లాయి. 'ప్రతినిధి-2'కు సెన్సార్ సమస్యలు ఉండడంతో రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. అది పొలిటికల్ మూవీ కావడంతో ఎన్నికల్లోపే వస్తే బాగుంటుందని టీం భావిస్తోంది. ఈ దిశగా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ లోపు ఈ గురువారం నుంచి వాయిదా పడ్డ 'లవ్ మి' సినిమాకు మాత్రం కొత్త డేట్ ఖరారైంది.

ముందు అనుకున్న దాని కంటే సరిగ్గా నెల రోజులు ఆలస్యంగా విడుదల కాబోతోంది 'లవ్ మి'. మే 25 కొత్త రిలీజ్ డేట్. దిల్ రాజు నిర్మాణంలో ఆయన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించిన హార్రర్ చిత్రమిది. అరుణ్ భీమవరకు డైరెక్ట్ చేశాడు. ఎం.ఎం.కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి లెజెండరీ టెక్నీషియన్స్ పని చేసిన చిత్రమిది. ఆశిష్ తొలి చిత్రం 'రౌడీ బాయ్స్' ఆశించిన విజయం సాధించలేదు.

రెండో చిత్రం 'సెల్ఫిష్' మధ్యలో ఆగినట్లు వార్తలు వస్తున్నాయి. దాన్ని హోల్డ్‌లో పెట్టి 'లవ్ మి' సినిమా చేసిన ఆశిష్.. దీని మీద టీం అంతా చాలా నమ్మకంతో ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే కష్టమని భావించి నెల రోజులు వాయిదా వేశారు.