Begin typing your search above and press return to search.

త‌ప్పైనా బాగుంద‌ని కంటున్యూ చేస్తున్నాం!

'ప్రేమ‌లు' విజ‌యంతో మ‌ల‌యాళం బ్యూటీ మ‌మితా బైజ్ ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   6 May 2024 1:30 AM GMT
త‌ప్పైనా బాగుంద‌ని కంటున్యూ చేస్తున్నాం!
X

'ప్రేమ‌లు' విజ‌యంతో మ‌ల‌యాళం బ్యూటీ మ‌మితా బైజ్ ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతోనే అమ్మ‌డు కుర్రాళ్ల క‌ల‌ల రాణిగా మారిపోయింది. మాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించ‌డంతోనే ఈ గుర్తింపు. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్ తో యువ‌త‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అలాగే ఆమె పేరు కూడా రొటీన్ కి భిన్నంగా అనిపిస్తుంది. దీంతో ఆ పేరు వెనుక చాలా పెద్ద క‌థే ఉంద‌న్న సంగ‌తి అమ్మ‌డు రివీల్ చేసింది.

ఆమె అస‌లు పేరు న‌మిత‌. ఆసుప‌త్రి సిబ్బంది బ‌ర్త్ స‌ర్టిఫికెట్ లో మ‌మిత‌గా న‌మోదు చేసారుట‌. స్కూల్లో జాయిన్ అయినా ఆ పేరు ని త‌ల్లిదండ్రులు కూడా గ‌మ‌నించ‌లేదుట‌. పేరు కూడా న‌చ్చ‌డంతో పాటు డిఫ‌రెంట్ గా ఉండ‌టంతో అలాగే వ‌దిలేసారంది. మమిత అంటే మిఠాయి. అంటే తియ్య‌గా ఉంటుంది. ఇక మ‌మిత‌ది 'ప్రేమ‌లు' తొలి తెలుగు సినిమా కాదంటోంది. న‌టిగా త‌నకిది 16వ చిత్ర‌మ‌ట‌. ఈ అమ్మ‌డు 'రెబ‌ల్' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఆ త‌ర్వాత ఇంకొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ అవేవి గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ప్రేమ‌లు స‌క్సెస్ అవ్వ‌డంతో సౌత్ లో మంచి పేరొచ్చింది. తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బేసిక్ గానే మ‌ల‌యాళం భామ‌ల‌కు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఇలా స‌క్సెస్ అయిన హీరోయిన్ల‌కు మ‌రింత గిరాకీ ఉంటుంది. ప్రేమ‌లు రిలీజ్ కాకుండా మ‌మిత‌కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి ముందే చెప్పేసారు.

ఆయ‌న చెప్పిన‌ట్లే ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆమె క్రేజ్ తో అమ్మ‌డు గ‌తంలో న‌టించిన సినిమాలు సైతం ఇప్పుడు తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. మార్కెట్ లో ఇదో ర‌క‌మైన స్ట్రాట‌జీ అన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి మెచ్చిన రాజ‌మౌళి త‌న సినిమాలో చిన్న ఛాన్స్ ఇస్తే పాన్ ఇండియాలోనే ఫేమ‌స్ అయిపోతుంది. మ‌రి జ‌క్క‌న్న మైండ్ లో అలాంటి ఆలోచ‌న ఉందో ? లేదో. దిల్ రాజు లాంటి నిర్మాత‌లు ఇలాంటి స‌క్సెస్ పుల్ నాయిక‌ల్ని ప్రోత్స‌హించ‌డంలో ముందుంటారు. ఆయ‌న కూడా ఏదైనా ఆఫ‌ర్ చేసే ఛాన్స్ ఉంది.