Begin typing your search above and press return to search.

మంచు డాటర్.. రెడ్ చిల్లీలా ఘాటుగా..

గుండెల్లో గోదారి సినిమాలో సూపర్ యాక్టింగ్ తో అవార్డులు కూడా గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:01 AM GMT
మంచు డాటర్.. రెడ్ చిల్లీలా ఘాటుగా..
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డాటర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మంచు లక్ష్మి. తనదైన రీతిలో టాలెంట్ ప్రదర్శిస్తూ హైలైట్ అయింది. అందంతో పాటు యాక్టింగ్ తో మంచి పేరు కొట్టేసింది. వరుస చిత్రాలు చేస్తూ సందడి చేస్తోంది. తండ్రి చూపిన సినీ బాటలోనే నడుస్తోంది మంచు డాటర్.


ఇంగ్లీష్ ఫిల్మ్‌ ద ఓడ్ తో తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది మంచు లక్ష్మి. ఆ తర్వాత డియర్ ఎయిర్ మూవీ చేసిన ఈ బ్యూటీ.. ఆ ఇయరే నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. లక్ష్మీ టాక్ షో ప్రోగ్రామ్ తో బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో అనగనగా ఓ ధీరుడు మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ తెలుగు మూవీలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది లక్ష్మీ ప్రసన్న.


గుండెల్లో గోదారి సినిమాలో సూపర్ యాక్టింగ్ తో అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ జోష్ తో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటించింది. పలు మూవీలు కూడా నిర్మించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ సంపాదించుకుంది. కొన్నిరోజులుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న మంచు డాటర్.. ప్రస్తుతం ఆదిపర్వం మూవీలో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ హారర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ట్రై చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ముంబై కూడా షిఫ్ట్ అయింది.

అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ఎంత యాక్టివ్ గా ఉందో అందరికీ తెలిసిందే. కంటిన్యూగా నయా లుక్స్ లో మెరుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఫొటో షూట్స్ చేస్తూ కొత్త ఫ్యాషన్ ను తన ఫాలోవర్స్ కు పరిచయం చేస్తోంది. రకరకాల పోజులు ఇస్తూ మైమరపిస్తోంది. గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేసి ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

తాజాగా రెడ్ చిల్లీలా రెడ్ కలర్ డ్రెస్ లో కిర్రాక్ పోజులిచ్చింది. లిఫ్ట్ లో ఫొటోలు దిగి తన లుక్స్ తో కట్టిపడేసింది. లైట్ గా థైస్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఓర చూపులతో ఫిదా చేస్తోంది. మంచు లక్ష్మి పోస్ట్ చేసిన క్షణాల్లోనే కొత్త పిక్స్ వైరల్ గా మారాయి. ముంబై వెళ్లాక బాలీవుడ్ టచ్ ఇచ్చావ్ గా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి చూడాలి బీటౌన్ లో మంచు లక్ష్మి ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో.