Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో వైట్‌ బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు ఆపరేషన్‌ వాలంటైన్ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్‌

By:  Tupaki Desk   |   28 March 2024 9:30 AM GMT
పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో వైట్‌ బ్యూటీ
X

తెలుగు ప్రేక్షకులకు ఆపరేషన్‌ వాలంటైన్ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్‌. హర్యానాకు చెందిన ఈ అమ్మడు 67వ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుంది. భారత్‌ తరపున ఈ కిరీటం దక్కించుకున్న ఆరవ యువతిగా మానుషి చిల్లర్‌ నిలిచింది.

మోడలింగ్ నుంచి బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. టాలీవుడ్‌ లో ఈ అమ్మడు చేసిన మొదటి ప్రయత్నం కమర్షియల్‌ గా నిరాశ పరిచింది. దాంతో మళ్లీ ఈ అమ్మడికి తెలుగు లో ఆఫర్లు వస్తాయా అంటే డౌటే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో ఆఫర్లు వచ్చినా రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో తన క్యూట్‌ అందాల ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

పొట్టి బ్లాక్ డ్రెస్ లో మానుషి చిల్లర్‌ అందం అదరహో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్న మానుషికి టైం కలిసి రావడం లేదని, ముందు ముందు అయినా ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.