Begin typing your search above and press return to search.

ఆ భ‌వ‌నానికి లెజెండ‌రీ న‌టుడి పేరు!

ఈ నేప‌థ్యంలో విశాల్ న‌డిఘ‌ర్ సంఘం భ‌వ‌నానికి కెప్టెన్ విజ‌య్ కాంత్ పేరు పెడుతామ‌ని ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   24 April 2024 7:43 AM GMT
ఆ భ‌వ‌నానికి లెజెండ‌రీ న‌టుడి పేరు!
X

కోలీవుడ్ లో న‌డిగ‌ర్ సంఘం కొత్త భ‌వ‌నం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సంఘం అధ్య‌క్షుడిగా నాజ‌ర్...జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా విశాల్ కొన‌సాగుతున్నారు. గ‌తంలో విశాల్ కూడా అధ్య‌క్షుడిగా ప‌నిచేసారు. ఆ స‌మ‌యంలో సంఘానికి సొంతంగా తానే భ‌వ‌నం నిర్మిస్తానని మాటిచ్చారు. ప్ర‌స్తుతం ఆ మాట నిల‌బెట్టు కుంటున్నారు. భ‌వ‌న నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విశాల్ న‌డిఘ‌ర్ సంఘం భ‌వ‌నానికి కెప్టెన్ విజ‌య్ కాంత్ పేరు పెడుతామ‌ని ప్ర‌క‌టించారు.

'కెప్టెన్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, అతను మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. నటీనటుల సంఘం భవనానికి విజయకాంత్ పేరు పెడతాం. నటీనటుల సంఘం కోసం ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. విజయకాంత్ ఎంతో మందికి ఆదర్శం. నటులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకుల్లో విజయకాంత్ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. సాధారణంగా ఒక వ్యక్తిని భూలోకం నుంచి వెళ్లిన తర్వాతే దేవుడిగా కొలుస్తాము.

కాని కానీ కెప్టెన్ బతికి ఉండగానే ప్రజల మనసుల్లో దేవుడిగా నిలిచాడు. ఎంత మంచి వారు కాకపోతే ప్రజలు కెప్టెన్ ను అలా కొలుస్తారు.. నటీనటులకు ఎంతో మేలు చేశారు. నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఎంతో సేవ చేశారు. పేద కళాకారులను ఆదుకున్నారు. నడిఘర్ సంఘ భవనానికి విజయ్ కాంత్ పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా గ‌ట్టిగానే వినిపిస్తుంది. పలువురు స్టార్స్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. కాబ‌ట్టి ఆయ‌న జ్ఞాప‌కార్దం న‌డిగ‌ర్ కి ఆయ‌న పేరు పెడ‌తామ‌న్నారు.

విశాల్ కి మద్ద‌తుగా సూర్య‌..కార్తీ లాంటి హీరోలు నిలుస్తుంటారు. ప్ర‌స్తుతం విశాల్' ర‌త్నం' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఈ కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన చిత్రాలు మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.